పెళ్లై పదేళ్లు అయినా ప్రియుడిని మర్చిపోని ప్రియురాలు.. ఆమె చేసిన పనికి ఆ ప్రియుడు బలి

ప్రేమ వల్ల ఆత్మహత్యలు, హత్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం.అత్యంత దారుణమైన సంఘటనలు మన చుట్టు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మరో సంఘటన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది.ఈ సంఘటనలో ప్రియుడు దుర్మరణం పాలవ్వడం శోచనీయం.

ప్రేమను మరిచి పోయి హాయిగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి మళ్లీ ప్రేమను కలిగించి అతడి చావుకు కారణం అయ్యింది.ఆమె రాకతో ప్రియుడు మరణించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.వేములవాడకు చెందిన రవి మరియు అదే ప్రాంతంకు చెందిన ఒక ముస్లీం అమ్మాయి 2009లో ప్రేమించుకున్నారు.రెండేళ్లు వీరిద్దరు ప్రేమించుకున్నారు.

Advertisement

ఆ సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.అయితే ఇరు వైపుల కుటుంబ సభ్యులు వారిద్దరిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లడంతో కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి వారి ఇంటికి పంపించడం జరిగింది.

ఆ సంఘటన జరిగిన వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.అయితే రవి మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఇంకా కూడా ఉన్నాడు.

ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇటీవలే ఉద్యోగ నిమిత్తం కువైట్‌ వెళ్లాడు.భర్త లేని కారణంగా ప్రియుడి ఇంటికి సమీపంలోనే ఆమె ఒక ఇల్లు కిరాయికి తీసుకుంది.అప్పుడప్పుడు రవిని కలుస్తూ వస్తోంది.

పదేళ్ల క్రితం వాడిపోయిన ప్రేమ మళ్లీ చిగురించింది.విషయం తెలిసిన అమ్మాయి తరపు బంధువులు అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

ముగ్గురు వ్యక్తులు రవి ఇంటికి బైక్‌ పై వచ్చిన సమయంలో నరికి చంపేశారు.ఆ సమయంలో రవి తల్లి తన కొడుకును ఏం చేయవద్దని వారి కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించకుండా చంపేసి వెళ్లి పోయారు.

Advertisement

తాజా వార్తలు