ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో పెంపుడు జంతువులను( Pet Animals ) పెంచుకోవడం కామన్ అయిపోయింది.చాలామంది తమ ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు.
ఇంకొంతమంది పక్షులను కూడా పెంచుకుంటుంటారు.దుబాయ్‌లోని కొందరు ధనికులు మాత్రం సింహాలు, పులులు లాంటి క్రూర మృగాలను తమ స్టేటస్ సింబల్ కోసం పెంచుకుంటున్నారు.
అంతేకాదు ఎలుగుబంట్లను( Bears ) కూడా తెచ్చి పెంచుకుంటున్నారు.నిజానికి వాటితో సన్నిహితంగా ఉండడానికి ఎంతటి వారైనా భయపడతారు.
ఎందుకంటే అవి మనుషులకు ఇంకా చేరువ కాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక వ్యక్తి ఎలుగు బంటితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు.ఆ వ్యక్తి ఎలుగు బంటికి స్పూన్‌తో( Spoon Feeding Bear ) ఆహారం తినిపిస్తుంటే అది అతడి పక్కనే నిల్చుని వేగంగా ఆహారం తింటుంది.ఇక అతడేమో ఎలుగుబంటికి ఆహారం తినిపిస్తూనే దానికి ముద్దు పెడుతున్నాడు.
చివర్లో ఆ ఎలుగుబంటి కూడా ఆ వ్యక్తికి ముద్దు పెడుతుంది.ఈ ఘటన రష్యాలో జరిగింది.
ఎలుగు బంటితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి ధైర్యాన్ని చూసి చాలా మంది అతని ప్రశంసిస్తున్నారు.
@panteleenko_svetlana అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో ఈ వీడియో షేర్ చేయబడింది.సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతున్న వీడియోను ఆరు కోట్ల మందికి పైగా వీక్షించగా, 22 లక్షల మందికి పైగా లైక్ చేసారు.అలానే చాలామంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
కొంతమందేమో ‘రష్యాలో ( Russia ) ఇలాంటివి సర్వ సాధారణం’ అని అంటుంటే.మరికొందరేమో ‘రష్యాలో చాలా మంది ఎలుగుబంట్లను పెంచుకుంటారు.’ అని కామెంట్లు చేశారు.ఏది ఏమైనా ఈ వీడియో చాలా మందికి నమ్మశక్యంగా కనిపించలేదు.
ఒకవేళ ఆ ఎలుగుబంటి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అని మరికొందరు ప్రశ్నించారు.వాటిని సహజ ఆవాసాల్లోనే పెంచితే బాగుంటుందని మరికొందరు సలహా ఇచ్చారు.