కెనడాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి, ‘‘గ్యాంగ్‌స్టర్’’గా అనుమానం

ఇటీవలికాలంలో కెనడాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నెలలో పలువురిని దుండగులు కాల్చి చంపారు.

 Man Shot Dead, Another Injured In Canada,canada, Canadian Government,gangster,gu-TeluguStop.com

ఈ క్రమంలో సర్రేలో మంగళవారం మూడు కాల్పుల ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.

మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

అయితే ఆ వ్యక్తికి నేర చరిత్ర వుందని పోలీసులు అంటున్నారు.ఆగస్ట్ 9 అర్ధరాత్రి దాటిన తర్వాత.

సర్రే ఆర్‌సీఎంపీ 76ఏ అవెన్యూలోని 14800 బ్లాక్‌లో తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బుల్లెట్ రంధ్రాలతో వున్న నివాసాన్ని గుర్తించారు.

ఇది జరిగిన 20 నిమిషాల తర్వాత 163 స్ట్రీట్‌లోని 9200 బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది.మొదటి సంఘటన మాదిరిగానే స్పందించిన అధికారులు.సాక్ష్యాలతో సహా నివాసాన్ని గుర్తించారు.ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ , సర్రే ఆర్‌సీఎంపీ పోలీస్ విభాగం కలిసి ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు.

సాక్ష్యాలను సేకరించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

మరోవైపు గత కొన్ని నెలలుగా కెనడాలో నేరాలు పెరుగుతున్నాయి.

ఈ విషయాన్ని ఎన్నో సంస్థలు తెలియజేస్తున్నాయి.ఈ మేరకు కెనడియన్ ప్రభుత్వ డేటా ఏజెన్సీ మంగళవారం కొత్త గణాంకాలను విడుదల చేశాయి.గన్ కల్చర్ కారణంగా దేశంలో వరుసగా ఏడో ఏడాది నేరాలు పెరిగాయని తెలిపింది.2020తో పోలిస్తే 2021లో తుపాకీ సంబంధిత నేరాలు 4 శాతం పెరిగాయని పేర్కొంది.

Telugu Canada, Canadian, Gangster, Gun, Surrey, Toronto, Weston Road-Telugu NRI

2020తో 39 శాతం నరహత్యలు తుపాకీతో జరగగా.2021లో అది 41 శాతానికి పెరిగింది.57 శాతం తుపాకీ సంబంధిత నరహత్యలలో … 57 శాతం తుపాకీతో , 26 శాతం రైఫిల్ లేదా షాట్ గన్‌తో జరిగినట్లు తెలిపింది.ఇకపోతే 2021లో 788 హత్యలను నివేదించారు.ఇవి గతేడాది కంటే 29 శాతం ఎక్కువ.2020లో ప్రతి 1,00,000 మంది జనాభాలో 2 నరహత్యలు జరగ్గా.2021లో ఇది 2.06కి పెరిగింది.బాధితుల్లో మూడింట ఒకవంతు (247) మందిని మైనారిటీలుగా గుర్తించారు.దేశంలోని ప్రధాన ప్రావిన్సులైన అంటారియో, బ్రిటిష్ కొలంబియాలో హత్యలు పెరిగాయి.
ఇక ఎన్ఆర్ఐ, 1985 కనిష్క విమాన ప్రమాదం కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసు భారత్ – కెనడాలలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ నెల 14న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో మాలిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

ఆయన హత్యకు సంబంధించి వాంకోవర్‌కు తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో వున్న బ్రిటీష్ కొలంబియాలోని అబోట్స్‌ఫోర్డ్‌కు చెందిన 21 ఏళ్ల టాన్నర్ ఫాక్స్, వాంకోవర్ శివారు న్యూ వెస్ట్‌మినిస్టర్‌కు చెందిన 23 ఏళ్ల జోస్ లోపెజ్‌లను అరెస్ట్ చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు.ఈ వరుస ఘటనలు కెనడా ప్రభుత్వాన్ని, పోలీస్ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube