చిన్నారిపై కామాంధుడి చూపు.. కాపాడిన తల్లి ముందుచూపు

ఏమీ తెలియని ఓ నాలుగున్నరేళ్ల పాపపై ఓ కామాంధుడు తన వికృత చేష్టలు చేయబోయి కటకటాలపాలైన ఘటన తమిళనాట చోటు చేసుకుంది.

తమిళనాడులోని మధురైలో జరిగిన ఈ ఘనట సభ్యసమాజం సిగ్గుపడేలా చేసేందుకు ఉదాహరణగా మిగులుతుందని అనుకుంటున్నారు అంతా.

ఇంతలోపే ఆ చిన్నారి తల్లి జాగ్రత్త పడటంతో ఆ కామాంధుడికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది.మధురై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Man Molested Four Years Girl In Tamil Nadu-చిన్నారిపై క�

ఓ మహిళ తన నాలుగేళ్ల చిన్నారితో బంధువుల ఇంటికి వెళ్లేందుకు అరపాలయం బస్సు టర్మినల్‌లో వేచి ఉంది.తనకు దాహం వేయడంతో నీటికోసం చిన్నారిని వదిలి పక్కకు వెళ్లింది.

ఇంతలోనే ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఓ వ్యక్తి తన చిన్నారి ఎత్తుకుని.ఇష్టారీతిలో చేతులు తాకుతూ.

Advertisement

ముద్దులు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఇది గమనించిన ఆ చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమయ్యింది.

పరిగెడుతూ వెళ్లి తన బిడ్డను ఆ కామాంధుడి చేతుల్లోంచి తనచెంతకు లాక్కుంది.అయినా ఆ కామాంధుడు బెదరకుండా ఆమెతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా అరిచింది.

దీంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసుకుని పోలీసులకు అప్పగించారు.కాగా చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు
Advertisement

తాజా వార్తలు