సెల్ఫీ తీసుకోవడానికి రైలు ఎక్కిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే!

సెల్ఫీ పిచ్చితో ఇప్పటికే ఎందరో మరణించారు.అయినా కూడా ఈ సెల్ఫీ పిచ్చి జనాల్లో ఇంకా పోలేదు.

ఏదైనా సాహసోపేతమైన ప్రదేశం లో సెల్ఫీ దిగి అందర్నీ ఆకట్టుకోవాలని చాలామంది పిచ్చి పనులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక యువకుడు సైతం సెల్ఫీ కోసం ఒక పెద్ద పిచ్చి పని చేశాడు.

ఇలాంటి మూర్ఖపు పని వల్ల అతడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది.

వివరాల్లోకి వెళితే.ఒక యువకుడు గూడ్సు రైలు ఎక్కి ఫొటో దిగాలి అనుకున్నాడు.

Advertisement

అయితే యువకుడు రైలు ఎక్కుతుండగా చాలామంది వద్దని వారించారు.అయినా తనకు ఏమవుతుందిలే అని ఒక పిచ్చి నమ్మకంతో అతడు అలాగే పైకి ఎక్కి సెల్ఫీ తీసుకోడానికి సిద్ధమయ్యాడు.

అయితే రైలు బోగిపై అతడు బ్యాలెన్స్ తప్పాడు.కింద పడి పోకుండా పైనే ఉన్న ఒక హై టెన్షన్ కరెంటు వైర్‌ని పట్టుకున్నాడు.

అంతే క్షణాల్లోనే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఈ యువకుడి ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి అని ఐడీ కార్డు ద్వారా పోలీసులు గుర్తించారు.

ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు కానీ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటన గురించి పోలీసులకు తెలియజేశామని ఆర్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ ఉషా నిరంకారీ మీడియాకు వెల్లడించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

గూడ్స్ రైలుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడినట్లు తమకు కొందరు ఫోన్ చేసి చెప్పారని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ అధికారి ఓం ప్రకాశ్ సైనీ పేర్కొన్నారు.ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని రాఘవ్ అగర్వాల్‌గా పోలీసులు గుర్తించారు.అనంతరం బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఒక దుర్ఘటనే చోటు చేసుకుంది.ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్-నర్కతీయగంజ్ రైలు మార్గంలో ఒక యువకుడు చనిపోయాడు.

చితౌని-బహాన్ రైలుపై ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ అతన్ని బలంగా ఢీకొట్టింది.దీంతో అతడి శరీరం తునాతునకలు అయింది.

ఈ ఘటనలను చూసైనా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

తాజా వార్తలు