న్యూయార్క్ : సిక్కు సంతతి వ్యక్తిపై విద్వేషదాడి.. నిందితుడిపై అభియోగాలు నమోదు, నేరం రుజువైతే 25 ఏళ్ల జైలు

ఇటీవల న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సిక్కు వృద్ధుడు జస్మర్ సింగ్‌ (66)పై( Jasmer Singh ) జరిగిన జాతి విద్వేష దాడి తీవ్ర దుమారం రేపింది.

‘‘ టర్బన్ మ్యాన్ ’’( Turban Man ) అని పిలుస్తూ వృద్ధుడిపై దుండగుడు విచక్షణారహితంగా దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు.

ఈ నేరానికి సంబంధించి నిందితుడిపై నరహత్య, దాడి, ద్వేషపూరిత నేరం అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.క్వీన్స్ జిల్లా అటార్నీ మెలిండా మాట్లాడుతూ.

నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌పై( Gilbert Augustin ) మంగళవారం విచారణ జరిగిందని చెప్పారు.ప్రతివాది చాలా తీవ్రమైన ఆరోపణలకు సమాధానం చెప్పవలసి వుంటుందని మెలిండా వెల్లడించారు.

అగస్టిన్ నేరం రుజువైతే అతనికి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం వుంది.క్వీన్స్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి కెన్నెత్ హోల్డర్.

Advertisement
Man Charged With Hate Crime In Fatal Attack On 66-year-old Sikh Man In New York

( Kenneth Holder ) విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేశారు.

Man Charged With Hate Crime In Fatal Attack On 66-year-old Sikh Man In New York

ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు అక్టోబర్ 20న నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.ఇతనిపై నరహత్య, దాడి అభియోగాలు మోపినట్లు డైలీ న్యూస్ నివేదించింది.అక్టోబర్ 19న క్యూ గార్డెన్స్‌లోని హిల్‌సైడ్ అవెన్యూ సమీపంలో వాన్ విక్ ఎక్స్‌ప్రెస్ వేపై( Van Wyck Expressway ) సింగ్.

అగస్టిన్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.రెండు కార్లపై గీతలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై సింగ్ 911కి కాల్ చేస్తుండగా.

అగస్టిన్ అతని చేతిలోని ఫోన్ లాక్కున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.ఈ వాగ్వాదం ముగిశాక.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

సింగ్ తన ఫోన్‌ను తీసుకునేందుకు గాను అతనిని అనుసరించాడు.

Man Charged With Hate Crime In Fatal Attack On 66-year-old Sikh Man In New York
Advertisement

ఎట్టకేలకు తన ఫోన్ సంపాదించి తన కారు దగ్గరికి వెళ్తున్న సింగ్‌ను అగస్టిన్ వెనుక నుంచి తల, ముఖంపై పదే పదే కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.దీంతో సింగ్ నేలపై కూలిపోయాడు.అయినప్పటికీ అగస్టిన్ అతనిని వదిలిపెట్టకుండా కొడుతూనే వున్నాడు.

కొద్దిసేపటికి తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి రెండు మైళ్ల దూరంలోనే అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.

అతని వద్ద సస్పెండ్ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ వుందని, అలాగే అతని అలబామా లైసెన్స్ ప్లేట్, న్యూయార్క్ రిజిస్ట్రేషన్‌తో సరిపోలలేదని పోలీసులు గుర్తించారు.

తాజా వార్తలు