ప్రస్తుతం అందరూ వయసుతో తేడా లేకుండా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.అందులో వచ్చే ఎన్నో ఫన్నీ వీడియోలు మనలను నవ్విస్తుంటాయి.
కొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి.మరికొన్ని మనలను బాధ పెడతాయి.
అయితే ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.టీవీలో పులి కనిపించగానే అది నిజమే అనుకుని ఆ వ్యక్తి భ్రమపడ్డాడు.
భయాందోళనతో ఊహించని పని చేశాడు.ఇది చూసిన నెటిజన్లు కొందరు నవ్వుకుంటుంటే, ఇదేం తీరు అంటూ మరికొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.సోషల్ మీడియాలోని ఫన్నీ వీడియోలు చాలా మందిని నవ్విస్తాయి.
అప్పటి వరకు సీరియస్ గా ఉన్న వారిని ఈ వీడియోలు ఆహ్లాదపరుస్తాయి.ఓ ఇద్దరు యువకులు చిన్న ఇంట్లో ఉంటున్నారు.
వారు టీవీ చూస్తూ ఆనందిస్తుంటారు.ఇంతలో హఠాత్తుగా పులి అందులో కనిపిస్తుంది.అది చూడగానే ఇద్దరిలో ఓ యువకుడు బాగా భయపడుతుంటాడు.తన చేతిలో ఉన్న పెద్ద కర్రతో ఆ టీవీని బలంగా కొడతాడు.దెబ్బకు టీవీ పగిలిపోతుంది.ఈ వీడియో నెటిజన్లను బాగా నవ్వులు పూయిస్తోంది.
అయితే టీవీలో పులిని చూడగానే అంత పెద్ద వ్యక్తి భయపడడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టీవీని పగలగొట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నారు.కొందరు సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించుకునేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ వైపు నవ్వులు పూయిస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూనే చాలా మందిని విస్మయపరుస్తోంది.