సీనియర్ నరేష్ ( Naresh )మరియు పవిత్ర లోకేష్( Pavitra lokesh ) ముఖ్య పాత్ర లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా( Malli Pelli movie ) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.నరేష్ మరియు పవిత్ర లోకేష్ కలిసి చాలా రొమాంటిక్ గా ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇంకా పాల్గొంటూనే ఉన్నారు.ఎన్నో ఇంటర్వ్యూ లో తమ యొక్క బంధం గురించి, రిలేషన్షిప్ గురించి, పరిచయం గురించి పవిత్ర లోకేష్ మాట్లాడడం జరిగింది.
సినిమా లో చూపించే కథ మొత్తం కూడా నరేష్ మరియు పవిత్ర లోకేష్ గత జీవితానికి సంబంధించినవి అని.ప్రస్తుత జీవితానికి సంబంధించినదని ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది.నరేష్ తన మాజీ భార్య విషయం లో చేసిన తప్పులు.వాటి వల్ల పడ్డ ఇబ్బందులు కూడా చూపించబోతున్నారని సమాచారం అందుతుంది.ఇక ఈ సినిమా లో కాస్త ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని చర్చ జరుగుతుంది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు క్లీన్ యు సర్టిఫికెట్ కాకుండా యూ/ఏ సర్టిఫికెట్( U/A Certificate ) వచ్చింది.దాంతో ఈ సినిమా లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని అర్థమవుతుంది.పవిత్ర లోకేష్ మరియు నరేష్ మధ్య ఆ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా లేదంటే సినిమా లో మరో యువ జంట కనిపించబోతోంది.
కనుక వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.గతంలో అడల్ట్ కంటెంట్ తో సినిమా లు తీసిన ఎమ్మెస్ రాజు దర్శకత్వం లో మళ్లీ పెళ్లి సినిమా రూపొందింది.
కనక ఈ సినిమా క్లీన్ యూ గా ఉంటుంది అనుకోవడం పొరపాటే.కనుక చిన్న చిన్న రొమాంటిక్ షాట్స్ సినిమా లో ఉండడం చాలా కామన్ విషయం అంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలతో సినిమా స్థాయి పెరగడం ఖాయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







