మొత్తానికి రెండు నెలల తరువాత ఇంటికి చేరుకున్న ఆ స్టార్ హీరో

కరోనా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా ఎక్కడకి వెళ్లిన వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా

లాక్ డౌన్

విధించడం తో సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి,అలానే విమాన రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం తో విదేశాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు.

లాక్ డౌన్ కు ముందు ఒక చిత్ర షూటింగ్ నిమిత్తం జోర్దాన్ వెళ్లిన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా తన చిత్ర యూనితో కలిసి వెళ్లారు.అయితే వారు అక్కడకి వెళ్లిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో చిత్ర యూనిట్ తో సహా పృథ్వి రాజ్ కూడా అక్కడే చిక్కుకు పోయారు.

Malayalam Star Hero Prithviraj Back To India After 2 Months Of Lockdown In Jorda

షూటింగ్ కోసం అని వెళ్లిన వారంతా కూడా దేశం కానీ దేశంలో తిండి దొరక్క నానా ఇబ్బందులు కూడా పడినట్లు వార్తలు కూడా వచ్చాయి.అయితే లాక్ డౌన్ పొడిగిస్తూ పోవడం తో వారు తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ప్రస్తుతం పృథ్విరాజ్ ఆడు జీవితం అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కోసమే 58 మంది చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఆయన కూడా జోర్దాన్ లో చిక్కుకుపోయారు.

Advertisement

దాంతో ఇప్పుడు అప్పుడూ అనుకుంటూ రెండు నెలలు అక్కడే ఉండిపోయారు.ఆ సమయంలో హీరో పృథ్వీరాజ్ తన ట్విట్టర్‌లో పరిస్థితిని కూడా పోస్ట్ చేసాడు.

అక్కడ తాము ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేశాడు.తమ యూనిట్‌ను ఇండియాకు రప్పించాలని కేరళ సీఎం విజయన్‌తో పాటు ఫిల్మ్ ఛాంబర్‌కు కూడా లేఖ రాసాడు.

ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో పృథ్వీరాజ్ సహా చిత్ర యూనిట్ ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఇండియా చేరుకున్నారు.దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు