అందం, అభినయం, ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ( Ineya ) కూడా ఒకరు.వాంగ చుడవా అనే సినిమాలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది నటీ ఇనయ.ఆమె మాతృభాష మలయాళం అయినప్పటికీ తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎక్కువగా చాలెంజింగ్ పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతోంది ఇనయ.ఒకవైపు హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ దూసుకుపోతోంది.
![Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/insult-director-insulte-social-media-kollywood-viral.jpg)
ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో( Anora Art Studio ) పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తి అయ్యింది.ఈ సందర్భంగా ఇనయ తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను తాజాగా మంగళవారం రోజున ఘనంగా నిర్వహించింది.ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇనయ మాట్లాడుతూ.నేను హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై.
ఇందులో యోగిబాబు( Yogi Babu ) హీరోగా నటించారు.
![Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/ineya-insult-director-insulte-Yogi-Babu-Thookudurai-social-media-kollywood-viral.jpg)
ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది.ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని చాలా దారుణంగా అవమానించారు.అలాంటిది ఇప్పుడు నేను తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను.
![Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie Telugu Actress Ineya, Insulte, Insult, Kollywood, Thookudurai, Yogi Babu-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/actress-ineya-insult-director-insulte-social-media-kollywood.jpg)
నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది.అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి.అయితే డైరెక్టర్గా మారడానికి ఇంకా సమయం ఉంది అని ఇనయ చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ ఆమె సక్సెస్ను మెచ్చుకుంటూనే ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.