ఈ ట్రాన్స్ జెండర్  హీరోయిన్ ని తన ప్రియుడు దారుణంగా....

తమిళంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు రామ్ దర్శకత్వం వహించిన "పెరంబు" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన "అంజలి అమీర్" గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే అంజలి అమీర్ ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ వచ్చి రావడంతోనే మలయాళ స్టార్ హీరో "మమ్ముట్టి" సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే పెరంబు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో అంజలి అమీర్ కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే ఆ మధ్య అంజలి అమీర్ తన ప్రియుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని అలాగే తనపై యాసిడ్ పోసి హత్య చేస్తానని అన్నాడని కాపాడాలంటూ ఫేస్ బుక్ లో లైవ్ కార్యక్రమం నిర్వహించి చెప్పు కొచ్చింది.

అంతేగాక తనకు సినిమా అవకాశాలు లేని సమయంలో దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు తన ప్రియుడు నుంచి తీసుకున్న మాట వాస్తవమేనని దాంతో అదే అదునుగా చేసుకుని తన ప్రియుడు తనతో అసభ్యంగా ప్రవర్తించడం మరియు చాలా కఠిన చర్యలకి పాల్పడుతున్నాడని చెప్పుకొచ్చింది.దీంతో ఆ మధ్య కేరళ పోలీసులు స్పందించి అంజలి అమీర్ ప్రియుడిపై చర్యలు తీసుకున్నారు.

దీంతో కొందరు ఆమె అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ ఒక్కోసారి జీవిత భాగస్వామి షయంలో చేసినటువంటి తప్పుల కారణంగా ఎవరు ఎలాంటి వ్యక్తిలో మనకు తెలుస్తుందని కాబట్టి ఇకనైనా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆమె మలయాళంలో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Advertisement

 అయితే తాజాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న "పుష్ప"  చిత్రంలో అంజలి అమీర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం  "పుష్ప"  చిత్రంలో అంజలి అమీర్  నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు