మలయాళ భామ మాళవిక మోహన్( Malvika Mohan ) ఇప్పటివరకు తమిళ, మలయాళ సినిమాలే చేసింది.ప్రభాస్( Prabhas ) మారుతి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది.
ఈ సినిమాతో మాళవిక తెలుగులో కూడా బిజీ అవడం గ్యారెంటీ అంటున్నారు.అయితే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రాగానే అమ్మడికి కొన్ని ఆఫర్లు వచ్చినా సరే తాను చేయనని అంటుందట మాళవిక.
అలా ఎందుకు అంటే ప్రభాస్ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమా హిట్ అయితే వచ్చే ఆఫర్లను బట్టి అమ్మడు భారీగా డిమాండ్ చేయొచ్చనే ప్లానింగ్ లో ఉంది.
అందుకే మాళవికకు తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా సారీ అనేస్తుందట.ఇప్పటికే యువ హీరోలు ఒకరిద్దరు ఆమెని తమ సినిమాలో తీసుకోవాలని ప్రయత్నించగా అమ్మడు కాదని చెప్పేసిందట.ప్రభాస్ సినిమా తర్వాతే తన నెక్స్ట్ సినిమా కమిట్ అవ్వాలని ఫిక్స్ అయ్యింది.
అంతేకాదు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే అమ్మడి టార్గెట్ అని తెలుస్తుంది.మొత్తానికి మరో మలయాళ భామ మాళవిక మోహనన్ టాలీవుడ్( Tollywood ) పై గురి పెట్టిందని చెప్పొచ్చు.
ప్రభాస్ సినిమా హిట్టైతే అమ్మడికి ఆఫర్ల వెళ్లువ మొదలవుతుందని చెప్పొచ్చు.అప్పుడైనా అమ్మడు అన్ని సినిమాలు సైన్ చేస్తుందా మళ్లీ ఏదైనా కండీషన్స్ పెడుతుందా అన్నది చూడాలి.