మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తన లేటెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్” ( Bhola Shankar )వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ వేదాళం అనే సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా తమన్నా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటించగా. కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటించింది.
ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.అయితే మొదటి షో తోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.కానీ కలెక్షన్స్ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది.ఈ సినిమా స్ట్రైట్ సినిమా కాకపోవడంతో ఆశించిన రేంజ్ లో వసూళ్లు రాలేదు అనే చెప్పాలి.దీంతో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా దేనిని ఎంచుకుంటారు అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి…
భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో ఈయన పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడని అంటున్నారు.మరి భోళా ఊహించని దెబ్బ కొట్టడంతో మెగాస్టార్ రీమేక్ సినిమాలను చేయడానికి ముందు ఆలోచిస్తారని అంటున్నారు.
భోళా కూడా రీమేక్ మూవీ కాబట్టి కలెక్షన్స్ లో ఏ మాత్రం మెగాస్టార్ రేంజ్ చూపించడం లేదు.అయితే భోళా రిలీజ్ కంటే ముందు మెగాస్టార్ బ్రో డాడీ సినిమా( Bro Daddy )ను ఓకే చేయనున్నాడు అనే కథనాలు వచ్చాయి…
అయితే ఇప్పుడు భోళా రిలీజ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.అందుకే మెగాస్టార్ ఇప్పుడు ఏ సినిమాను అనౌన్స్ చేస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.మళ్ళీ రీమేక్ తోనే వస్తారా లేదంటే ఈసారి స్ట్రైట్ సబ్జెక్ట్ తో వస్తారా అనే ప్రశ్న అందరిలో ఉంది.
మరి మెగాస్టార్ బర్త్ డే నాటికీ ఈయన నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.చూడాలి నెక్స్ట్ ఏ సినిమా ఎప్పుడు అనౌన్స్ మెంట్ ఉంటుందో.