'మైనంపల్లి ' టార్గెట్ హరీష్ రావు ! 

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli hanumanthrao ) బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.కేసీఆర్ ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా ఉన్నా.

 'mainampally' Target Harish Rao , Mainampalli Hanumanthrao, Brs, Brs Mla, Meda-TeluguStop.com

తన కుమారుడు రోహిత్( Mynampally Rohith )కు మెదక్ టికెట్ కేటాయించకపోవడంపై మైనంపల్లి అలక చెందారు.ఆ కోపంతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇక కెసిఆర్ టికెట్ల ప్రకటనకు ముందు రోజే మంత్రి హరీష్ రావు పై  సంచలన విమర్శలు చేశారు.బిఆర్ఎస్ లో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి కారణం హరీష్ రావేనని( Hareesh Rao ) మైనంపల్లి భావిస్తున్నారు.

Telugu Brs Mla, Congress, Hareesh Rao-Politics

.రాబోయే రోజుల్లో హరీష్ రావును టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లాలని మైనంపల్లి డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హరీష్ రావే టార్గెట్ గా మెదక్ జిల్లా బాధ్యతలను తీసుకుంటున్నారు.బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ఈ జిల్లాపై మైనంపల్లి ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు .రామాయంపేటకు చెందిన మైనంపల్లి గతంలో టిడిపి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు.తర్వాత మల్కాజ్ గిరి కి మారారు.ఇపుడు తన కుమారుడి కోసం మెదక్ స్థానంపై దృష్టి పెట్టారు.

Telugu Brs Mla, Congress, Hareesh Rao-Politics

 మెదక్ సొంత జిల్లా కావడంతో పాటు , అక్కడ క్షేత్రస్థాయిలో గట్టి పట్టు ఉండడంతో , మెదక్ తో పాటు నరసాపూర్ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్ పేరుతో అనేకమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు.దేవాలయాలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వైద్య విద్య అవసరాల కోసం మైనంపల్లి ( Mainampalli hanumanthrao )సాయం చేస్తూ ఉంటారు.ఇదంతా రాబోయే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని మైనంపల్లి ఆశలు పెట్టుకున్నారు.

అప్పుడే మెదక్ జిల్లాలో మైనంపల్లి దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఎప్పటి నుంచో మెదక్ జిల్లా బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు అన్ని వ్యవహారాలు చూస్తున్నారు.

దీంతో హరీష్ రావు ప్రభావాన్ని తగ్గించేందుకు మైనంపల్లి రంగంలోకి దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube