దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి( Music Director Chakri ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరియర్ ను మొదలుపెట్టారు చక్రి.
ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,ఇడియట్, శివమణి, సత్యం దేవదాసు,దేశముదురు,సింహా లాంటి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.అలా తెలుగులో దాదాపుగా 85 సినిమాలకు సంగీత దర్శకుడిగా( Music Director ) వ్యవహరించారు.
సంగీతంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు చక్రి.కానీ ఊహించని విధంగా చెప్పి ఊబకాయి సమస్యతో 2014 డిసెంబర్ 15వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.
చక్రి తర్వాత ఆ కుటుంబం నుంచి వారసుడిగా ఆయన సోదరుడు మహిత్ నారాయణ్( Mahit Narayan ) సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు.లవ్ యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు మహిత్ నారాయణ్.
ఇదిలా ఉంటే ఇటీవలకు ఇంటర్వ్యూలో పాల్గొన్న మహిత్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన అన్నయ్య మరణాన్ని గుర్తు తెచ్చుకొని బాగోద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో బాగా మాట్లాడుతూ.
తన అన్నయ్య మరణం తీరని లోటు అని, అమ్మ ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతోందీ అని తెలిపారు మహిత్.

ఇంట్లో టీవీ పెట్టాలంటేనే భయం వేస్తుందని ఎప్పుడు అన్నయ్య పాట వస్తుందో తెలియదు.ఆయన పాటలు వచ్చినప్పుడు అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది అని చెప్పుకొచ్చారు మహిత్.అన్నయ్య భార్యతో జరిగిన గొడవల వల్ల తాము వేరే ఇంట్లోకి వెళ్లిపోయామని, అన్నయ్య చనిపోయే ముందు రోజు రాత్రి తమ దగ్గరకు వచ్చి వెళ్లారని అన్నారు.
తెల్లారి ఉదయం అన్నయ్య చనిపోయారన్న వార్త వచ్చిందని, కానీ ఇప్పటికీ అన్న మరణం పై అనుమానం ఉంది అని చెప్పుకొచ్చారు మహిత్.

ఆయనది సహజ మరణం కాదని, సహజ మరణమే అయితే పోస్టుమార్టం చేయించడానికి ఎందుకు భయపడ్డారని మహిత్ వెల్లడించారు.చనిపోయే ముందు అన్నకు అమ్మ విషం పెట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.కన్న తల్లికి తన కొడుకుకు విషం పెట్టి ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు.
అయితే తమ దురదృష్టం కొద్దీ అన్న ఎలా చనిపోయారనేది నిరూపించలేకపోయామని, అక్కడే తాను ఫెయిల్ అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిత్. చక్రి చనిపోయాక ఆయన స్టూడియో మహిత్ కి వచ్చేసిందని ప్రచారం చేశారు.కానీ అందులో ఎటువంటి నిజం లేదు.ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగులబెట్టి ఆ నేరాన్ని తనపై మోపారని, అన్నయ్య గుర్తులు ఏమీ లేకుండా పోయాయి అంటూ భావోద్వేగానికి గురయ్యారు మహిత్ నారాయణ్.
