వామ్మో.. ఆ సాంగ్ చేస్తూ మహేశ్వరి లోయలో పడిపోయారట!

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి, హీరోయిన్ మహేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హీరోయిన్ మహేశ్వరి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియక పోవచ్చు కానీ ఇంతకు ముందు తరం ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే.

అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.హీరోయిన్ శ్రీదేవి బంధువుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.

మహేశ్వరి తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ఇక చాలామందికి హీరోయిన్ మహేశ్వరి పేరు వినగానే గులాబీ, పెళ్లి సినిమాలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి.ఎందుకంటే మహేశ్వరి నటించిన ఆ రెండు సినిమాలు ఎప్పటికీ బెస్ట్ గా నిలిచిపోతాయి.

Advertisement
Maheshwari Recalls Gulabi Bike Song Shoot Accident In Alitho Saradaga Show, Mahe

ఇదిలా ఉంటే తాజాగా మహేశ్వరి ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చింది.ఈ క్రమంలోనే మహేశ్వరి ఎన్నో విషయాలను పంచుకుంది.

ఇక ఈ క్రమంలోనే మహేశ్వరి మాట్లాడుతూ.హీరోయిన్ శ్రీదేవి తనకు అక్క కాదు పిన్ని అవుతుంది అని మహేశ్వరి అసలు విషయాన్ని బయట పెట్టింది.

శ్రీదేవి గారు ప్రస్తుతం లేరు అని నేను అనుకోవడం లేదు.ఏదో షూటింగ్ కోసం వెళ్ళినట్టే ఉంది.

ఆమె ఎప్పుడూ లేదు అని తాము ఎప్పుడూ అనుకోలేదు అంటూ మహేశ్వరి ఎమోషనల్ అయ్యింది.

Maheshwari Recalls Gulabi Bike Song Shoot Accident In Alitho Saradaga Show, Mahe
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

అనంతరం గులాబీ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది అంట కదా? అని ఆలీ ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన మహేశ్వరి.నాకు బైక్ పై ఎక్కడం అలవాటు లేదు.

Advertisement

ఆ సమయంలో ఎదురుగా నుంచి ఒక వెహికల్ రావాలి.ఆ సమయంలో బైక్ స్కిడ్ అయిపోయింది.

లోయలో పడిపోయింది అని చెప్పుకొచ్చింది మహేశ్వరి.కానీ అదృష్టవశాత్తు ఆ లోయ కేవలం 10 అడుగుల లోతు మాత్రమే ఉంది.

ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటే ఊహించని ఘటన జరిగి ఉండేది అని మహేశ్వరి చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు