సర్కారు వారి పాట సూపర్ హిట్ తో జోష్ మీద ఉన్న మహేష్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.త్రివిక్రం తో చేస్తున్న సినిమా నుంచి మే 31న స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే.ఆ రోజు మహేష్ సినిమాకు సంబందించిన అప్డేట్ ఖచ్చితంగా ఇస్తారు.
అలానే ఈసారి త్రివిక్రం సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.ఆల్రెడీ టైటిల్ ఫస్ట్ లుక్ కోసం షూట్ కూడా అయిపోయిందని ప్రస్తుతం త్రివిక్రం అండ్ టీం పోస్టర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత రీసెంట్ గా కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ కొద్దిరోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు యూరప్ వెళ్లారు.తిరిగి రావడంతోనే త్రివిక్రం సినిమా సెట్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది.
మహేష్ త్రివిక్రం హ్యాట్రిక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమాను హాసిని హారిక క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది.