బాలివుడ్ హీరోకి ఎసరు పెట్టిన మహేష్ బాబు?

అత్యంత పాపులారిటి ఉన్న తెలుగు హీరో ఎవరు అంటే గుక్కతిప్పుకోకుండా మహేష్ బాబు అని చెప్పొచ్చు.మహేష్ కి దేశవ్యాప్తంగానే కాదు, ఇతర దేశాల్లో కూడా అభిమానులున్నారు.

 Mahesh To Replace Aamir Khan?-TeluguStop.com

మహేష్ చేసింది కేవలం తెలుగు సినిమాలే అయినా, మన సూపర్ స్టార్ అంటే అదోరకం అభిమానం ఇతర రాష్ట్రాల్లో కూడా.అందుకే ఇప్పటికే కొన్ని కంపెనీలు దేశవ్యాప్తంగా మహేష్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న గాస్సిప్ ఏమిటంటే, ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెని స్నాప్ డీల్ మహేష్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునే అలోచనలో ఉందట.

అదేంటి స్నాప్ డీల్ కు ప్రచారకర్త బాలివుడ్ రారాజు ఆమీర్ ఖాన్ కాదా, అంత పెద్ద స్టార్ ను వదిలేసి మహేష్ వెంట పడాల్సిన అవసరం ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ మధ్య ఆమీర్ అసహనం మీద చేసిన వాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే కదా.అప్పటినుంచి దేశవ్యాప్తంగా స్నాప్ డీల్ మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ఒక్క రోజు షూటింగ్ చేస్తే ఆమీర్ కి అందే మొత్తం 8 కొట్లు.

భారతదేశంలో ఇదే అత్యధికం.అంత ఖర్చు పెట్టి తిట్లు ఎందుకు తినడం, పైగా మహేష్ అయితే తక్కువలో వస్తాడు, అలాగే ఇటు హింది జనాలు కూడా గుర్తుపడతారు అని స్నాప్ డీల్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం దాగుందో కాలమే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube