సూపర్ స్టార్ మహేష్( Mahesh babu ) రాజమౌళి కాంబినేషన్ సినిమా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.కె.
ఎల్ నారాయణ( K.L.Narayana ) నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజమౌళి నో కాంప్రమైజ్ అంటున్నారట.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల నుంచి 1500 కోట్ల దాకా ఉంటుందని టాక్.
మహేష్ కెరీర్ లోనే కాదు ఇండియన్ హిస్టరీలో అంత బడ్జెట్ సినిమా అంటే అవాక్కవుతున్నారు ఆడియన్స్.ఇప్పటివరకు ఇండియన్ సినిమా టార్గెట్ 1000 కోట్లు కాగా అంత బడ్జెట్ తో సినిమా అంటే నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు.
ముఖ్యంగా అంత బడ్జెట్ పెడుతున్నారు అంటే రాజమౌళి ఈ సినిమాను కచ్చితంగా రెండు మూడు భాగాలు తీసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.మరి రాజమౌళి( Rajamouli ) ప్లాన్ ఎలా ఉందో కానీ మహేష్ మాత్రం ఈ సినిమాకు కచ్చితంగా 3 ఏళ్లు రాసి ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా మహేష్ 29 భారీ క్రేజ్ తో వస్తుంది.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.ఈ సినిమాలో స్టార్ కాస్ట్ టెక్నిషియన్స్ అందరు టాప్ రేంజ్ లో ఉంటారని తెలుస్తుంది.