అసంతృప్తిగా మహేష్ బాబు

సూపర్ స్టార్ కి కోపం వచ్చింది.ఈ కోపం గొడవల వలన కాదు, అసంతృప్తి వలన.

మామూలుగా ఒక్కసారి మహేష్ సినిమా ఒప్పుకున్నడంటే మళ్లీ దానిలో వేలు పెట్టడు.కాని మహేష్ తన పద్ధతి మార్చుకున్నాడు.

మహేష్ తన పద్ధతి మార్చుకోవడానికి కారణం ఎవరు? మహేష్ ని అసంతృప్తికి గురి చేసిందెవరు? మహేష్ అసంతృప్తికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.అవును, అడ్డాల వలనే మహేష్ కి కోపం వచ్చింది.

విషయం ఏమిటంటే, బ్రహ్మోత్సవం కథ పూర్తిగా చెప్పలేదు అడ్డాల.కాని లైన్ బాగా నచ్చడంతో సినిమా చేస్తున్నామని, బ్యాలెన్స్ గా ఉన్న కథ త్వరగా పూర్తి చేయమని చెప్పాడు మహేష్.

Advertisement

ఇప్పుడు దర్శకుడు కొత్తగా రాసుకున్న సన్నివేశాలు నచ్చలేదు మహేష్ కు.వెంటనే అడ్డాలను పిలిచి గట్టిగా క్లాస్ పీకాడట సూపర్ స్టార్.ఎక్కడెక్కడ మార్పులు కావాలో చెప్పి వెంటనే ఆ పనిలో ఉండమని చెప్పాడట మహేష్.

ప్రస్తుతం దర్శకుడు ఆ పనులలో ఉన్నాడు.బ్రహ్మోత్సవం షూటింగ్ కు ఓ వారం బ్రేక్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు