సూపర్ స్టార్ మహేష్ కొత్త అడ్డా ఫిక్స్ చేసుకున్నాడు.సినిమా సినిమాకు తన లుక్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్న మహేష్ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇంకా యంగ్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు.
అందుకే టాలీవుడ్ హ్యాండ్సం హీరో అంటే మొదట మహేష్ పేరునే చెబుతారు.సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమాలో మహేష్ లుక్ అదిరిపోతుందని తెలుస్తుంది.ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుంది.
అందుకే తన లుక్ విషయంలో మరింత కష్టపడుతున్నాడు మహేష్.
ఈ క్రమంలో మహేష్ తన కొత్త జిమ్ స్పాట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
దానికి సంబందించిన వీడియోని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశాడు.మహేష్ చమటోడ్చేందుకు కొత్త అడ్డా ఫిక్స్ చేసుకున్నాడు.
ఇందులోనే మహేష్ తన ఫిట్ నెస్ ట్రైనింగ్ పొందుతాడని తెలుస్తుంది.రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడేందుకు సిద్ధమైన మహేష్ కొత్త ట్రైనర్ ని పెట్టుకుని లుక్ మార్చాలని చూస్తున్నాడు.
మహేష్ చేస్తున్న ఈ కష్టానికి తగిన ఫలితం వస్తుందనే చెప్పొచ్చు.







