సుష్మితా సేన్ కోసం అలియా భట్ తండ్రి.. నువ్వు అలాంటోడివేలే అంటూ మళ్ళీ ట్రోల్స్?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోలింగ్స్ కీ గురవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.అయితే సెలబ్రిటీలు ఏం చేసినా కూడా దానిని నెగిటివ్ గా ఆలోచించి దానిని తప్పులు పడుతూ వారి ఫోటోలు వారు చేసిన ట్వీట్స్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

 Mahesh Bhatt Defends Trolling Aginst Sushmitha Sen Dating Lalit Modi Details, Su-TeluguStop.com

కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వారి పేర్లలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌, లలిత్‌ మోదీల పేర్లు కూడా ఉన్నాయి.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని తెలియడంతో వారిపై సోషల్ మీడియాలో పోస్టులు,మీమ్స్ ఈ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే.

అయితే వారి ప్రేమ విషయం పట్ల పాజిటివ్ గా స్పందించిన వారి కంటే నెగిటివ్ గా స్పందించిన వారి సంఖ్యను ఎక్కువగా ఉంది.

అంతేకకాకుండా లేటు వయసులో ఘాటు ప్రేమ, ఈ వయసులో ప్రేమ అవసరమా అంటూ కొంతమంది కామెంట్లతో వారిద్దరిని తిట్టిపోస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్.ఈ వైఖరి అంత మంచిది కాదు అని ఆయన విమర్శించారు.సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది.ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది.అంతటి గట్స్‌ కూడా ఆమెకు ఉన్నాయి.తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను.

తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్‌ చేయాల్సిందే.ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి అని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు.

Telugu Alia Bhatt, Bollywood, Lalit Modi, Mahesh Bhatt, Sushmita Sen, Sushmithal

అలాగే ఆమె గతంలో విక్రమ్ భట్ తో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ.దస్తక్‌ సినిమా చేద్దామనుకున్నా అందుకు సుస్మిత కూడా ఓకే చెప్పింది.తర్వాతేం జరిగిందో మనందరికి తెలిసిందే.దస్తక్‌ షూటింగ్‌ సమయంలో సుష్మితా సేన్‌, విక్రమ్‌ భట్‌ ప్రేమించుకున్నారు.విక్రమ్‌ నాకు కుడిభుజంలా ఉండేవాడు.అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని అని చెప్పుకొచ్చారు మహేశ్‌ భట్‌.

సెట్స్‌లో ఆమెతో సరదాగా మాట్లాడేవాడు.అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అంటూ అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్‌ భట్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube