బీస్ట్ మోడ్ లో సూపర్ స్టార్.. జిమ్ లో చాలా కష్టపడుతున్నాడుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.( Guntur Karam ) ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు.

 Mahesh Babu Latest Pics Go Viral Details, Guntur Kaaram, Mahesh Babu, Trivikram,-TeluguStop.com

ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ పిక్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.ఎందుకంటే మహేష్ ఎప్పుడు కనిపించని బీస్ట్ లుక్ లో( Beast Look ) కనిపించాడు.మహేష్ కు సంబంధించిన ఈ లేటెస్ట్ క్లిక్ క్షణాల్లోనే నెట్టింట క్లిక్ అయ్యింది.ఈ పిక్ చూస్తుంటే మహేష్ బాబు ఈ బీస్ట్ లుక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది.

మరి ఈ రేంజ్ లో వర్కౌట్ చేస్తున్నాడు అంటే గుంటూరు కారం కోసం ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో అర్ధం అవుతుంది.

త్రివిక్రమ్( Trivikram ) మహేష్ లుక్ ను పూర్తిగా మార్చేసి తమ సినిమా కోసం కొత్త లుక్ లో రెడీ చేయించాడు.మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా ఉండగా అతి త్వరలోనే అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube