టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఒకరు.ఈయన కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇలా పలు సినిమాలలో బాల నటుడిగా నటించినటువంటి మహేష్ బాబు అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతుంది.ఇక త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ వెళ్లారు.

ఇలా వారి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నప్పటికీ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ మాత్రం రీవీల్ చేయలేదు.ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సినిమాల పరంగా కొన్ని నియమ నిబంధనలను పెట్టుకున్నారట.పొరపాటున కూడా ఆ లిమిట్స్ క్రాస్ చేయరని అలా కనుక చేయాల్సి వస్తే ఇండస్ట్రీకి దూరం అవుతాను కానీ తాను పెట్టుకున్నటువంటి లిమిట్స్ మాత్రం దాటనని ఈయన ఓ ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు కథ డిమాండ్ చేస్తే కనుక బోల్డ్ సీన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు కానీ మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన ఏ ఒక్క సినిమాలో కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు లేవనే చెప్పాలి ఇలా ఈయన బెడ్ రూమ్ సీన్స్ వంటి సన్నివేశాలలో కనుక నటించాల్సి వస్తే తాను సినిమా నుంచి తప్పుకుంటానని పొరపాటున కూడా తన లిమిట్స్ క్రాస్ చేయనని మహేష్ బాబు పలు సందర్భాలలో వెల్లడించారు.సినిమాలు పరంగా ఈయన పెట్టుకున్నటువంటి ఆ లిమిట్స్ తెలిసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు.