మహేష్ బాబు సినిమాలో నటించబోతున్న సీనియర్ హీరోయిన్ ఎవరు?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కార్ వారి పాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపద్యంలో మహేష్ బాబు వెంటనే మరో సినిమాను చేసి సూపర్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకున్నారు.

 Mahesh Babu Trivikram Movie Interesting Update Details, Mahesh Babu, Director Trivikram, Senior Heroine, Ssmb28, Sarkaru Vari Paata, Venu Tottempudi, Mahesh Babu Movie Update, Tollywood-TeluguStop.com

సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సమయంలోనే త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందే షూటింగ్ ప్రారంభమవుతుందని అంత భావించారు.

కానీ రెండు సినిమాలు ఒకే సారి చేయడం ద్వారా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మహేష్ బాబు భావించి సర్కారు వారి పాట సినిమా విడుదలైన వెంటనే షూటింగ్ మొదలు పెడదామని త్రివిక్రమ్ కి మహేష్‌ హామీ ఇచ్చాడు.కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన షూటింగ్ కానీ ఎలాంటి అప్డేట్ కానీ లేదు.

 Mahesh Babu Trivikram Movie Interesting Update Details, Mahesh Babu, Director Trivikram, Senior Heroine, Ssmb28, Sarkaru Vari Paata, Venu Tottempudi, Mahesh Babu Movie Update, Tollywood-మహేష్ బాబు సినిమాలో నటించబోతున్న సీనియర్ హీరోయిన్ ఎవరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే మహేష్ బాబు ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏర్పాట్లు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

ఈ నెలలో సినిమాని పట్టాలెక్కించేందుకు గాను చర్యలు తీసుకున్నారు.తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి ని కీలక పాత్రకు ఎంపిక చేశాడని సమాచారం అందుతుంది.

మరోవైపు ఒక సీనియర్ హీరోయిన్ సినిమాలోని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం అందుతుంది.ఆ సీనియర్ హీరోయిన్ గతంలో పలువురు స్టార్ హీరోలతో నటించింది.

ఇప్పటి వరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేదు.

Telugu Mahesh Babu, Sarkaruvaari, Ssmb, Tollywood, Trivikram, Venu Tottempudi-Movie

కనుక మహేష్ బాబు సినిమాలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోకి తల్లిగానా లేదా మరి ఏదైనా ముఖ్య పాత్రలో ఆమె కనిపిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు.కానీ ఆమె సినిమాలో ఉండడం వల్ల కచ్చితంగా సినిమా కు అదనపు ఆకర్షణ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు.

హీరోయిన్ ఎవరు అన్న విషయంలో ఇంకా ఎలాంటి లీక్‌ బయటికి రానివ్వడం లేదు.ఆ హీరోయిన్ ముఖ్య పాత్ర అనే విషయంలో మాత్రం స్పష్టతను ఇచ్చారు.

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలో సీనియర్ హీరోయిన్లను ముఖ్య పాత్రలో నటింపజేయడం కామన్ విషయమే.

Telugu Mahesh Babu, Sarkaruvaari, Ssmb, Tollywood, Trivikram, Venu Tottempudi-Movie

అందుకే ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో ఒక సీనియర్ హీరోయిన్ నటింపజేయడం అనేది కచ్చితంగా జరగబోతుంది కానీ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.త్రివిక్రమ్ మరియు మహేష్ బాబుల కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కనుక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అంటారు.

ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆడకున్నా ఇప్పటికీ టీవీలో వస్తే సూపర్ హిట్ టాక్ తో మంచి రేటింగ్ దక్కించుకుంటున్నాయి.కానీ ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా మరియు అన్ని రకాలుగా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మహేష్ బాబుకు సంబంధించిన సినిమా షూటింగ్ని అతి త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube