మహేష్ చేతుల మీదుగా శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాను పలాస సినిమా ఫేం దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ కొట్టేందుకు హీరో సుధీర్ బాబు రెడీ అవుతున్నాడు.అయతే ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కరుణ కుమార్ తీర్చిదిద్దినట్లు చిత్ర వర్గాల టాక్.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై మరిన్ని అంచనాలను రేకెత్తిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు వారు ప్లాన్ చేశారు.ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు మహేష్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Advertisement

ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా మాసీగా ఉంటుందని, లైటింగ్ సూరిబాబు అనే పాత్రలో సుధీర్ బాబు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను 70 ఎంఎం బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా కట్ చేశారో తెలయాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?
Advertisement

తాజా వార్తలు