ఉత్తమ్ సింగ్ S/o సూర్యనారాయణ గా రావాల్సిన సినిమా పోకిరి గా ఎలా మారింది

మ‌హేష్ బాబును టాలీవుడ్ టాప్ హీరోగా మార్చిన సినిమా పోకిరి.శివ త‌ర్వాత మ‌రో అంత‌టి ఇండ‌స్ట్రీ హిట్ సాధించిన మూవీ.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసి రికార్డులు తిర‌గ‌రాసింది ఈ చిత్రం.అల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించింది.

ఈ సినిమా క‌థ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బ‌ద్రి సినిమా చేస్తున్న స‌మయంలోనే పూరీ జ‌గ‌న్నాథ్ రాసుకున్నాడు.ప‌వ‌న్ కు చెప్పాడు కూడా.

అయితే ఈ స్టోరీ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌.ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో చేయాలి అనుకున్నాడ‌ట‌.

Advertisement
Mahesh Babu Pokiri Movie Unknown Facts-ఉత్తమ్ సింగ్ So �

డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో వెన‌క్కి త‌గ్గాడు.ఓరోజు మ‌హేష్ బాబుకు ఈస్టోరీ వినిపించాడు.

త‌న‌కు న‌చ్చ‌డంతో ఓకే చెప్పాడు.కానీ పూరీ ఈ సినిమాకు పెట్టిన ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ మార్చమని మహేష్ సలహా ఇచ్చాడ‌ట‌.

పండు , పోకిరి అనే పేర్లను సజెస్ట్ చేసాడు.పూరీ పోకిరి అనే టైటిల్ ఓకే చేశాడ‌ట‌.

ఈ సినిమాను 9 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాడు.రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.2006 ఏప్రిల్ లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా మూవీ రిలీజ్ అయ్యింది.నెమ్మ‌దిగా ప్రారంభం అయిన హిట్ టాక్.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

కొద్ది రోజుల్లోనే దుమ్మురేపింది.జ‌నాలు ఈ సినిమా చూసేందుకు థియేట‌ర్ల‌కు ఎగ‌బ‌డ్డారు.

Advertisement

ఈ సినిమాలోని పాట‌లు, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ జ‌నాల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.అద్భుత‌మైన క్లైమాక్స్, మంచి బ్య‌డ్రౌండ్ స్కోర్ అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకుంది.

ఈ సినిమాలో పూరీ జ‌గ‌న్నాథ్ అద్భుత‌మైన డైలాగ్స్ రాశాడు.అంత‌కు ముందు ఏ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ చూసి ఉండ‌రు.

ముమైత్ ఖాన్ ఇప్ప‌టికింకా నాయ‌వ‌సు అనే పాటు యూత్‌ను తెగ ఆక‌ట్టుకుంది.గ‌ల‌గ‌ల పారుతున్న అంటూ కృష్ణ పాట‌ను రిమేక్ చేసి ఈ సినిమాలో పెట్టుకున్నారు.

ఈ పాటకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

75 ఏండ్ల సినీ ఇండ‌స్ట్రీలో పోకిరీ ఎన్నో రికార్డులు సాధించింది.టాలీవుడ్ లో ఫస్ట్ టైం 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది.300 సెంటర్లలో 50 రోజులు, 200 సెంటర్స్ లో 100 రోజులు , 63 సెంటర్ లలో 175 రోజులు ఆడింది.హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో కోటి 70 లక్షల గ్రాస్ వసూల్ చేసింది.

పోకిరితో మ‌హేష్ సూపర్ స్టార్ అయ్యాడు.తమిళ , కన్నడ, హిందీ, బెంగాల్ భాషల్లోకి రీమేక్ అయిన ఈ మూవీ అక్క‌డ కూడా సూప‌ర్ హిట్ సాధించింది.

తాజా వార్తలు