సొంత డబ్బంతా పోగొట్టుకుంటున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి అన్నట్లే కాని, మహేష్ బాబు హీరోగా ఎంటర్ అవుతున్నప్పుడు వారి ఇంటి పరిస్థితులు మరి అంత గొప్పగా ఏమి లేవు.కారణాలు కరెక్టుగా తెలియవు కాని కృష్ణ అప్పుడు అప్పుల్లో ఉన్నారు.

 Mahesh Babu Loosing Personal Money With Every Film-TeluguStop.com

పద్మాలయ స్టూడియోస్ లో కొంత భాగాన్ని అమ్మేసుకున్నారు కూడా.మహేష్ తన తొలిరోజుల్లో పెద్దగా పారితోషికం తీసుకోలేదు.

ఎంతైనా కొద్దిగా సాఫ్ట్ మనిషి కదా.నిర్మాతల కష్టాలు చూసి వెంటనే కరిగిపోతాడు.ఒక్కడుతో మెల్లిగా ఆర్థిక పరిస్థితులను బెటర్ చేయడం మొదలుపెట్టాడు మహేష్‌.పారితోషికం కోట్లకు చేరుకుంది ఈ సినిమాతోనే.

మరి ఇప్పుడు మహేష్ దక్షిణాదిలో రజనీకాంత్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు.బ్రాండ్ల ద్వారా వచ్చే డబ్బులు లెక్కవేసుకుంటే, దక్షిణాది మొత్తంలో అత్యధిక అదాయం అందుకుంటున్న నటుడు.

సినిమా కాకుండా, ఇతర వ్యాపారాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ర్యాంకు మారుతుంది.ఎలాగైతే ఏం, మహేష్ బాబు బాగా సంపాదిస్తున్నాడు.

మరి ప్రాబ్లెం ఏమిటి?

ప్రాబ్లెం లాంటిది ఏమి లేదు‌.మహేష్ కి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు.

కాని గత మూడు సంవత్సరాలుగా సంపాదించిన దాని కంటే, బయటకి వెళ్ళినా డబ్బే ఎక్కువ అంట.మహేష్ ఎలాగో తన ఆదాయంలో 30% ఛారిటి పనులకి ఉపయోగిస్తాడు‌.హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ లో చిన్నపిల్లలకు ఉచిత వైద్య సహకారం అందిస్తాడు మహేష్.ఈ విధంగా డబ్బు బయటకి వెళితే వెళ్ళింది, మంచిదే.

కాని సినిమాలు డిజాస్టర్ అవడం, మహేష్ బాధపడుతూ తన పారితోషికంలో చాలావరకు తిరిగి ఇచ్చేయడం, ఇదో కామన్ విషయం అయిపోయింది.గత అయిదు సినిమాల్లో నాలుగు సినిమాలకు ఇదే జరిగింది.

ఇదే పద్దతి కంటిన్యూ అయితే మళ్ళీ మహేష్ కుటుంబం ఎక్కడ అప్పుల్లో పడుతుందో అని ఘట్టమనేని అభిమానులు బెంగ పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube