మహేష్ బాబు అంటే ఎవరికీ భయం లేదా..? మరి ఇంత అలుసా!

సర్కారు వారి పాట చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న గుంటూరు కారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎందుకంటే మహేష్ - త్రివిక్రమ్ ( Trivikram Srinivas )కాంబినేషన్ కి జనాల్లో ఉన్న ఆదరణ అలాంటిది.గతం లో వీళ్లిద్దరి కలయిక లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయిన, టీవీ టెలికాస్ట్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకున్నాయి.

పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురం లో వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై మరింత క్రేజ్ పెరిగింది.ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఖలేజా( Khaleja ) సినిమాలో మహేష్ బాబు ని ఎలా అయితే కొత్తగా చూపించాడా , ఈ చిత్రం లో కూడా యాస , బాషా, లుక్స్ ఇలా అన్నీ విషయాల్లో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో సరికొత్తగా చూపించాడని టీజర్ మరియు పోస్టర్స్ చూసినప్పుడు అనిపించింది.ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అన్నీ ప్రాంతాలకు రెండు నెలల ముందే పూర్తి అయ్యింది.

Advertisement

సుమారుగా 160 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.అలాంటి క్రేజీ సినిమా వస్తుంది అన్నప్పుడు చిన్న సినిమాలు విడుదల అయ్యేందుకు భయపడుతాయి.కానీ గుంటూరు కారం విషయం లో మాత్రం అలా జరగడం లేదు.

సంక్రాంతికి మరో పెద్ద సినిమా లేదు అని తెలియడం తో గుంటూరు కారం తో పోటీ పడేందుకు వరుసగా నాలుగు సినిమాలు క్యూ లో ఉన్నాయి.

ఎప్పటి నుండో ప్రేక్షకులను ఊరిస్తున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం( Hanuman ) కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా తో పాటుగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగల్, అక్కినేని నాగార్జున హీరో గా నటిస్తున్న నా సామి రంగా చిత్రాలు సంక్రాంతి రిలీజ్ కి లాక్ చేసుకున్నాయి.వీటితో పాటుగా విక్టరీ వెంకటేష్ హీరో గా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైన్దవ్ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు గుంటూరు కారం తో పోటీ కి దిగడం వల్ల గుంటూరు కారం చిత్రానికి థియేటర్స్ కరువు వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అవసరం, మరి ఏమి అవుతుందో చూడాలి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు