ఏంట్రా జుట్టు ఇంత పెంచావు.. మహేష్ లుక్ పై సోదరి మంజుల కామెంట్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా తన లుక్ మొత్తం మార్చేశారు.

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయేది సినిమా ఓ అడ్వెంచరస్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది.ఇకపోతే ఇప్పటివరకు మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు కానీ తాజాగా మహేష్ బాబు లుక్ రివీల్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసేలా ఉంది.అయితే తాజాగా మహేష్ బాబు లుక్ గురించి తన అక్క మంజుల( Manjula ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి తన రిలేటివ్స్ వివాహానికి వెళ్లారు.అయితే ఈ వివాహానికి మహేష్ బాబు సోదరి మంజుల కూడా హాజరయ్యారు.ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మరిన్ని ఇందులో మహేష్ బాబుని తన అక్క చూడగానే తన జుట్టును పట్టుకొని ఇంత జుట్టు పెంచావేంట్రా అనేలా మాట్లాడారు.

Advertisement

ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ లుక్ లో మహేష్ బాబును చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం ( Gunturu kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు