టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు ( Mahesh Babu ) ఒకరు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఈయన ఎన్నో సినిమాలలో బాల నటుడిగా నటించారు అనంతరం కృష్ణ వారసత్వాన్ని అంది పుచ్చుకుని హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాలో నటిస్తున్నారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా అతడు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇంకా ఈ కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.ఇలా
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు సినీ కెరియర్లో ఆల్ టైం సూపర్ హిట్ సినిమాలు గురించి మాట్లాడాల్సి వస్తే ముందు పోకిరి సినిమా( Pokiri Movie )గురించి మాట్లాడాలి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.అప్పటివరకు మహేష్ బాబు సినీ కెరియర్ లో ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా రాలేదని చెప్పాలి.పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా ( Ileana )హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
ఈ సినిమా మహేష్ బాబుకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయో చెప్పాల్సిన పనిలేదు అయితే ఈ సినిమాలో చేసినందుకు మహేష్ బాబుకి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా మరొకవైపు తీవ్రమైనటువంటి నష్టాలు కూడా వచ్చాయని తెలుస్తుంది.
ఒకానొక సమయంలో మహేష్ బాబు( Mahesh Babu ) ఎందుకు పోకిరి సినిమాలో నటించానా అని బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట ఈ సినిమా చేసిన తర్వాత మహేష్ బాబు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.పోకిరి సినిమా ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఈయన అతడు ఖలేజా సైనికుడు వంటి సినిమాలలో నటించారు.
అయితే ఈ సినిమాలో పెద్దగా సక్సెస్ కాలేదు.పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చూసిన తర్వాత అభిమానులు అందరూ కూడా అదే స్థాయి సినిమాలను ఊహించుకున్నారు కానీ ఏ సినిమాలు ఆ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో వరుసగా ఫ్లాప్ సినిమాలు మహేష్ ఖాతాలో వచ్చి చేరాయి.
ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో ఎందుకు నేను పోకిరి సినిమాలో నటించాను అని మహేష్ బాబు ఎంతో మదనపడ్డారట.వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో తన మార్కెట్ కూడా పడిపోయింది ఇలాంటి సమయంలోనే తనకు దూకుడు సినిమా ( Dookudu )మంచి సక్సెస్ ఇచ్చిందని ఈ సినిమా ద్వారా మహేష్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారని చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy