మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా ప్రకటన వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది.కరోనా ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు కనీసం చిత్రీకరణ కూడా పూర్తి అవ్వలేదు.
ఈ ఏడాది ఆగస్టు లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమా లు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.కానీ ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి.
అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సారి రాబోతున్న సినిమా పై ఫ్యాన్ మరియు సినీ జనాల అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా కమర్షియల్ హిట్ అయ్యే విధంగా దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.
ఇప్పటి వరకు ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.ఆ మధ్య మహా శివరాత్రి సందర్భం గా సినిమా నుండి కీలక అప్డేట్ రాబోతుందని ప్రచారం జరిగింది.

టైటిల్ రివీల్ చేయడం తో పాటు మహేష్ బాబు యొక్క ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.అయితే ఇప్పటి వరకు శివరాత్రి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా చిత్ర సభ్యులు అధికారికంగా తెలియజేయలేదు.సినిమా చిత్రీకరణ చాలా స్లో గా జరుగుతుందని అభిమానులు విమర్శిస్తున్నారు.

అంతే కాకుండా ఇప్పటి వరకు కనీసం టైటిల్ ని కూడా రివీల్ చేయకుండా ఫస్ట్ లుక్ విడుదల చేయకుండా అభిమానుల యొక్క సహనానికి పరీక్ష అన్నట్లుగా దర్శకుడు త్రివిక్రమ్ వ్యవహరిస్తున్నాడు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.కనీసం ఉగాది వరకైనా మహేష్ బాబు యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని దర్శకుడు త్రివిక్రమ్ రిలీజ్ చేస్తాడేమో చూడాలి.








