దర్శకుడి మాటలతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉలిక్కి పాటు

Mahesh Babu Fans Angry About Director Speech , Mahesh Babu ,Muragadas,Mahesh Babu Career,Spider

తమిళ దర్శకుడు మురగదాస్( Muragadas ) ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ( Mahesh Babu )అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.మురగదాస్ చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్క సారిగా ఉలిక్కిపడేలా కూడా చేశాయి అనడంలో సందేహం లేదు.

 Mahesh Babu Fans Angry About Director Speech , Mahesh Babu ,muragadas,mahesh Ba-TeluguStop.com

మహేష్ బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో స్పైడర్ ( Spider )అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకోవడంతో పాటు మహేష్ బాబు కెరియర్ ( Mahesh Babu Career )లోనే అత్యంత దారుణమైన సినిమాల జాబితాలో నిలిచింది.

అలాంటి సినిమా ను మహేష్ బాబు కు అందించిన దర్శకుడు మురగదాస్ మరో సారి మహేష్ బాబు తో తాను సినిమా ను తీయాలనుకుంటున్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబుతో మురగదాస్ తీసిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ స్పైడర్‌ చాలు బాబోయ్.

మళ్ళీ మహేష్ బాబు తో సినిమా ను చేయకండి మీకు దండం అంటూ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా ద్వారా మృగదాస్ కి కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు గజిని వంటి అద్భుతమైన సినిమాలను ఆవిష్కరించిన దర్శకుడు మురగదాస్ ఇప్పుడు మహేష్ బాబు తో సినిమాకు చాలా కష్టపడాల్సి వస్తుంది.అంతే కాకుండా మహేష్ బాబు యొక్క అభిమానులతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏమాత్రం అతిశయోక్తి లేకుండా మహేష్ బాబు మరియు మురగదాస్ కాంబినేషన్లో సినిమా రావాలి అంటూ కొందరు పతి కొందరు ఆశ పడుతున్నారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.మురగదాస్ కూడా మహేష్ బాబుతో అద్భుతమైన సినిమాలను తీయగలరు అంటూ కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి మహేష్ బాబు ఒప్పుకుంటాడా మురుగదాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది చూడాలి.ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు.

ఆ తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా ఉంటుంది.జక్కన్న సినిమా తర్వాత మురుగదాస్ సినిమా ఉంటే బాగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Video : Mahesh Babu Fans Angry About Director Speech #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube