టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda ) ఒకరు.ఈయన ఇదివరకు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఇటీవల నటించిన డీజే టిల్లు( DJ Tillu ) సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సినిమా ద్వారా ఈయన నటనకు డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.దీంతో సిద్దు జొన్నలగడ్డకు భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.
టిల్లు కాస్త మహేష్ బాబు ( Mahesh Babu ) లా మారితే ఎలా ఉంటారనే ఉద్దేశంతో అభిమానులు అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని డిజే టిల్లు సినిమాలో ఒక సన్నివేశాన్ని అచ్చం మహేష్ బాబు చేసినట్టు ఒక వీడియో క్రియేట్ చేశారు.ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో సిద్దు రాధికా అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు.సిద్దూ ముఖానికి బదులు మహేష్ బాబు ఫేస్ ను ఎడిట్ చేసి అలాగే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్( Artificial Intelligence ) ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ ను కూడా సెట్ చేశారు.
ఇక ఈ వాయిస్ కూడా మహేష్ బాబు అచ్చం తెలంగాణ యాసలో మాట్లాడుతున్నట్టే సెట్ చేశారు.ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ కాస్తా టిల్లుగా మారిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ గెటప్ మహేష్ బాబుకి ఎంతో అద్భుతంగా సెట్ కావడం విశేషం.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఇటీవల గుంటూరు కారం ( Guntur Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ప్రస్తుతం రాజమౌళి ( Rajamouli ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.