నాన్నను అలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్! 

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు మహేష్ బాబు ( Mahesh Babu ) తాజాగా కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

కృష్ణ( Krishna ) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు తన తండ్రి నటించిన సినిమాలను ఎంతో స్పూర్తిగా తీసుకుంటారని చెప్పాలి.

అయితే కృష్ణ గారు నటించినటువంటి సినిమాలలో అల్లూరి సీతారామరాజు ( Alluri Seetharamaraju ) సినిమాకు ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పాలి.

Mahesh Babu Comments On Super Star Krishna Alluri Sitharamaraju Movie, Mahesh Ba

ఈ సినిమా తెలుగు సినిమాలలో ఎప్పటికీ చెరగని ముద్ర సంపాదించుకుంది.రామచంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1974 మే 1వ తేదీ విడుదలైంది.అంటే సరిగా నిన్నటికి ఈ సినిమా విడుదల ఈ 50 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.

Mahesh Babu Comments On Super Star Krishna Alluri Sitharamaraju Movie, Mahesh Ba

నాన్నగారిని తెరపై గంభీరమైనటువంటి లుక్ లో చూసి ఎంతో ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది.ఈ సినిమాని ఇప్పుడు చూసిన మొదటిసారి చూసాననే భావన ఉంటుందని తెలిపారు.ఈ సినిమా విడుదలయ్యి నేటికీ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Advertisement
Mahesh Babu Comments On Super Star Krishna Alluri Sitharamaraju Movie, Mahesh Ba

నటుడిగా నా ప్రయాణం తెలుగు సినిమా పై నా ప్రభావాన్ని గుర్తు చేసుకుంటున్నాను అంటూ మహేష్ బాబు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాని గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ఈ ఏడాది జనవరిలో గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా టాక్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.ఇక త్వరలోనే రాజమౌళి( Rajamouli ) సినిమాతో మహేష్ బాబు బిజీ కానున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు