ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సముద్రఖని. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమాతో మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
ఆ సినిమాలో విలన్ గా నటించిన అందుకుగాను మంచి మార్కులే పడ్డాయి.ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా సముద్రఖనే విలన్.
అయితే మొదట ఈ సినిమాలో పాత్ర కోసం చాలా మంది ప్రముఖుల పేర్లు పరిశీలించినప్పటికీ చివరగా సముద్రఖని ని విలన్ గా ఎంచుకున్నారట.
సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని పాత్ర బాగా పండిందని, ఈ సినిమాలో ఆ పాత్ర మేజర్ హైలైట్ అవుతుంది అని చిత్రబృందం చెబుతోంది.
హీరో మహేష్ బాబు కూడా విలన్ సముద్రఖని గురించి గొప్పగానే చెబుతున్నారు.షూటింగ్ సెట్లో ఆయన ప్రవర్తన, నటన అన్ని బాగా ఉంటాయి అంటూ కితాబు ఇచ్చాడు.
అంతేకాకుండా మహేష్ సముద్రఖని కి త్వరలోనే కళ్ళజోడు జాబు కొనిస్తాడట.ఎందుకంటే.
సముద్రఖనికి కళ్లజోళ్ల సేకరణ బాగా అలవాటు ఉందట.
ఎక్కడైనా కొత్త తరహా కళ్లజోడు చూసిన,కనిపించిన వెంటనే ఆ కళ్ళజోడుని కొనేస్తారట.
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ వాడిన కళ్లజోళ్లు సముద్రఖనికి బాగా నచ్చాయట.

అందుకే మీరు వాడిన కళ్లజోడు ఒకటి ఇస్తారా.మీ గుర్తుగా దాచుకుంటా’ అని అడిగాడట.నేను ఈ సినిమా చూశాను.
ముఖ్యంగా సముద్రఖని గారి నటనకు ముగ్థుడ్ని అయ్యాను.ఆయన నన్నొక కళ్లజోడు అడిగారు.
ఆయన నటన చూశాక.ఒకటేంటి.
ఆయనకోసం కళ్లజోళ్ల షాపే కొని ఇద్దామనిపించింది అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నేడు అనగా మే 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.







