మహేష్ బాబు హీరో గా ఈ ఏడాది వచ్చిన సర్కారు వారి పాట మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలుస్తుందే.ఆ సినిమా సక్సెస్ అయిన నేపథ్యం లో మహేష్ బాబు అభిమానులు వెంటనే తదుపరి సినిమా ను మొదలు పెట్టాలని కోరుకున్నారు.
కానీ పలు కారణాల వల్ల మహేష్ బాబు తదుపరి సినిమా షూటింగ్ కార్యక్రమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా మొదట ప్రకటించారు.
కానీ సినిమా అనుకున్న తేదీ కి రావడం లేదని ఇప్పటికే ప్రకటించారు.షూటింగ్ కార్యక్రమాలు అనుకున్నట్లుగా జరగక పోవడం తో విడుదల ఆలస్యం అవుతుందట.
మొదటి షెడ్యూల్ పూర్తయి నెలలు కావస్తున్నా రెండవ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వక పోవడం తో త్రివిక్రమ్ పై మహేష్ బాబు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలు మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఏం జరుగుతుందో తెలియక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన కథ విషయం లో పలు సార్లు పలు రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.త్రివిక్రమ్ కథ ను పదే పదే మార్చాడని.
మహేష్ బాబు కూడా కథ విషయం లో అసంతృప్తి తో ఉన్నాడని ఆ పుకార్ల సారాంశం.ఇప్పటికైనా కథ పూర్తిగా రెడీ అయ్యిందా రెండవ షెడ్యూల్ ప్రారంభమైందా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం పుష్కర కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమా ని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో చేయబోతున్న విషయం తెలిసిందే.