మహేష్‌ విషయానికి వచ్చేప్పటికి త్రివిక్రమ్‌ ఇలా ఎందుకు...?

మహేష్ బాబు( Mahesh babu ) హీరోగా త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కి గుంటూరు కారం( Gunturu karam ) అనే టైటిల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది.ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Mahesh Babu And Trivikram Movie Gunturu Karam Details, Telugu Cinema News,mahesh-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన విజువల్స్ తాజాగా విడుదల అయ్యాయి.మహేష్ బాబు ని మాస్ గా చూపించే ఉద్దేశం తో త్రివిక్రమ్ కాస్త ఎక్కువగా ఆలోచించినట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.

గతంలో ఖలేజా విషయంలో కూడా మహేష్ బాబుని ఎక్కువగా చూపించే ఉద్దేశం తో త్రివిక్రమ్ చేతులెత్తేశాడు.మహేష్ బాబు సినిమా అనగానే త్రివిక్రమ్ చాలా స్పెషల్ గా ఉండాలని ఏదో ప్లాన్ చేయబోతున్నాడు.

చివరకు ఆ సినిమా తల కిందులవుతోంది.

Telugu Gunturu Karam, Mahesh Babu, Maheshbabu, Puja Hegde, Sreeleela, Ssmb, Telu

అతడు మరియు ఖలేజా సినిమా లు మహేష్ బాబు ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే అనే విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాల ఫలితాలు ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు.కనుక ఇప్పుడు మహేష్ బాబు తో త్రివిక్రమ్ చేస్తున్న గుంటూరు కారం సినిమా విషయం లో ఫలితం ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా టైటిల్ ( Title )విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.మరి కొందరు మాత్రం త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా విషయంలోనే ఆలోచన లేకుండా వ్యవహరించడానికి కారణమేమిటో అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అభిమానులు మాత్రం మహేష్ బాబు యొక్క మాస్ ఇమేజ్ పెంచే విధంగా గుంటూరు కారం ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరో ఆరు నెలలు వెయిట్ చేయాల్సిందే.

ఇక మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపాందుతున్న ఈ సినిమా లో మహేష్ బాబు పాత్ర ఏంటి అనేది కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube