వీడియో : స్టార్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ఓపెన్‌ కి హాజరైన తారా తోరణం

ఈమద్య కాలంలో బాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ ఇతర భాషల స్టార్స్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నారు.హైదరాబాద్‌ లో షూటింగ్ ల కోసం హజరు అవుతున్న వేరే భాష ల స్టార్స్ ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్స్ తో భేటీ అవ్వడం.

 Mahanati Movie Director Nag Aswin New Office Open By Amithabh And Prabhas , Amitabh Bachchan , Flim News, Mahanati, Nag Aswin, Nani, Prabhas-TeluguStop.com

వారితో పార్టీ లు చేసుకోవడం చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్ బచ్చన్‌.

.మలయాళ స్టార్‌ దుల్కర్ సల్మాన్ మరియు కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఇంకా ప్రముఖులు నాగ్‌ అశ్విన్‌ కొత్త ఆఫీస్ ప్రారంబోత్సవంకు హాజరు అయ్యారు.

 Mahanati Movie Director Nag Aswin New Office Open By Amithabh And Prabhas , Amitabh Bachchan , Flim News, Mahanati, Nag Aswin, Nani, Prabhas-వీడియో : స్టార్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ఓపెన్‌ కి హాజరైన తారా తోరణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ వారి ఆఫీస్ లోనే నాగ్‌ అశ్విన్‌ సినిమా పనులు జరుగుతూ ఉండేవి.కాని ఇప్పుడు ఆయన తన కొత్త ఆఫీస్ ను మొదలు పెట్టాడు.

అత్యంత విశాలంగా అద్బుతమైన ఇంటీరియర్ తో ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

స్వప్న దత్‌ మరియు ప్రియాంక దత్ లు వచ్చిన అతిధులకు ప్రత్యేంగా ఆఫీస్ మొత్తం చూపించారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో నాని కూడా హాజరు అయ్యాడు అనేది సమాచారం.విజయ్ దేవరకొండ కూడా హాజరు అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్‌ వల్ల హాజరు కాలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ్‌ అశ్విన్‌ భారీ మొత్తంలో ఈ ఆఫీస్ కోసం ఖర్చు చేశారట.అమితాబచ్చన్ రిబ్బన్ కట్‌ చేసి ఆఫీస్ ఓపెన్ చేయాల్సిందిగా నాగ్ అశ్విన్‌ కోరగా.

పక్కన ఉన్న ప్రభాస్ ను పిలిచి ఇద్దరు కలిసి రిబ్బన్ కట్‌ చేశారు.అమితాబ్‌ మరియు ప్రభాస్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ ఆఫీస్ ద్వారా మొదటి సినిమా ప్రాజెక్ట్‌ కే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా లో వీరిద్దరు కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube