జనతా గ్యారేజీ సినిమా అందరికీ తెలిసిందే.కానీ అనాజ్ గ్యారేజ్ గురించి ఎప్పుడైనా విన్నరా.
ఇదెక్కడి కొత్త పదం అనుకుంటున్నారు కదా.అయితే మీరే తెలుసుకోండి ఈ స్టోరీ గురించి.ప్రతిభను ఎవ్వరూ ఆపలేరు అంటారు.ఇక ఎదైనా వస్తువు నచ్చితే చాలు దాని మీద అనేక పరిశోధనలు చేస్తుంటారు కొందరు.మరికొందరు వాటిని కొనుగోలు చేయడమో లేక తయారు చేసుకోవడంమో చేస్తుంటారు.అయితే అలా ఓ యువకుడికి కార్లు అంటే చాలా ఇష్టం.
ఇక కొత్త మోడల్ కారు వచ్చిందంటే చాలు, వాటిని చూడనిది దాని ఫీచర్స్ తెలుసుకోకుండా ఉండరు.అయితే అలా ఓ యువకుడికి కార్లంటే చాలా ఫుల్ ఇష్టం.
దీంతో ఆయన ఏకంగా ఓ గ్యారేజ్ నే పెట్టుకున్నాడు.కానీ అందులో ఉండేవి నిజమైన కార్లు కాదండోయి.ఏంటో చూడండి.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనాజ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు.
అయితే అతనికి చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ఇష్టం ఉండేదంట.పెద్దాయిన తర్వాత అన్నిరకాల కార్లు కొందామనుకున్నాడంట.
కానీ తన ఆర్థిక పరిస్థితి, పలు కారణాల వలన ఆయనకు కొనడం సాధ్యపడలేదు.దీంతో కాస్త వినూత్నంగా ఆలోచించాడు.
కాగితంతో కార్లను తయారు చేస్తూ ఆనందపడటం మొదలు పెట్టాడు.
అలా తన చిన్నప్పటి నుంచి , దళసరిగా ఉన్న కాగితాలతో బొమ్మకార్లు తయారు చేసేవాడు.బొమ్మను 3 సెంటిమీటర్ల నుంచి గరిష్టంగా 7 సెంటీమీటర్ల పొడవు ఉండే కార్లను తయారు చేశాడు.అవి చూడటానికి అచ్చం నిజమైన కార్లు అనే విధంగా ఉంటాయి.
అలా 355 రకాల కార్లను తయారు చేసి తన ఇంట్లో ప్రదర్శనగా ఉంచాడు.దీంతో యువకుడు ప్రదర్శనను చూసిన వారందరూ ఫిదా అయిపోతున్నారు.
అనాజ్ మాట్లాడుతూ. భవిష్యత్తులో విమానాలు, హెలికాఫ్టర్లు తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అని, ప్రతిభను ప్రదర్శించే అవకాశం వస్తే, పిల్లలకు కాగితంతో ఇలాంటి బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్పుతాను అన్నాడు.