టీనేజ్ లో మదన పెట్టే మొటిమలను వేగంగా మాయం చేసే మ్యాజికల్ టిప్స్ మీకోసం!

టీనేజ్ అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైనది.టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే స్త్రీ, పురుషుల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

టీనేజ్ లో అందంగా కనిపించేందుకు దాదాపు అందరూ తెగ ఆరాటపడుతుంటారు.కానీ హార్మోన్స్( Hormones ) లో వ‌చ్చే మార్పుల కార‌ణంగా మొటిమలు( Pimples ) తెగ ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ సౌందర్యాన్ని( Beauty ) దెబ్బతీస్తాయి.మొటిమలతో చాలా మంది తీవ్రంగా బాధ పడుతుంటారు.

అయితే టీనేజ్ లో మదన పెట్టే మొటిమలను వేగంగా మాయం చేయడానికి కొన్ని మ్యాజికల్ టిప్స్ ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Magical Tips To Get Rid Of Acne In Teens Details, Acne, Magical Tips, Acne Remov
Advertisement
Magical Tips To Get Rid Of Acne In Teens Details, Acne, Magical Tips, Acne Remov

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్‌ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చలు ఉన్నచోట అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు చాలా వేగంగా మాయమవుతాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Magical Tips To Get Rid Of Acne In Teens Details, Acne, Magical Tips, Acne Remov

అలాగే మొటిమల‌ను వేగంగా తరిమి కొట్టడానికి మరొక ఎఫెక్టివ్ రెమెడీ ఉంది.దానికోసం ఒక అరటిపండు తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బనానా పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకొని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని రోజుకు ఒకసారి పాటించినా సరే మొటిమలు త్వరగా త‌గ్గు ముఖం పడతాయి.

Advertisement

వాటి తాలూకు మచ్చలు మాయం అవుతాయి.అలాగే ఈ రెమెడీ వల్ల చర్మం కాంతివంతంగా సైతం మారుతుంది.

తాజా వార్తలు