రీల్స్ కోసం ఎస్‌యూవీతో రైలు పట్టాల మీదకి వెళ్లిన మందుబాబు.. చివరికి?

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు రీల్స్ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

రీల్స్ వారిని పిచ్చి వారిని చేస్తున్న వీటివల్ల వచ్చే లాభం తక్కువ కానీ నష్టం ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

రీల్స్(reels) మోజులో పడి ప్రజలు ఎలా తయారవుతున్నారో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది చూసి చాలా మంది ఇది పిచ్చికి పరాకాష్ట అని కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur, Rajasthan) ఓ వ్యక్తి తన మహీంద్రా థార్‌(Mahindra Thar) కారును రైల్వే ట్రాక్‌పైకి తీసుకెళ్లి సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియో తీయాలని ప్రయత్నించాడు.మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి కారును ట్రాక్‌పై నుంచి తీయలేక పోయాడు.

అప్పుడే అటుగా ఓ గూడ్స్‌ రైలు వచ్చింది.అదృష్టవశాత్తూ ఆ రైలు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

జైపూర్‌లో తన మహీంద్రా థార్‌ కారును రైల్వే ట్రాక్‌పైకి తీసుకెళ్లి సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియో తీయాలని ప్రయత్నించిన వ్యక్తి, తన అతివేగంతో మరో ముగ్గురిని గాయపరిచాడు.కొంతమంది ప్రేక్షకులు ఆ వ్యక్తికి సహాయం చేసి కారును ట్రాక్‌ నుంచి బయటకు తీసిన తర్వాత, ఆ వ్యక్తి తన కారును వెనక్కి నడిపి రోడ్డుకు చేరుకోవడానికి ప్రయత్నించాడు.అయితే అతను అతివేగంతో ముగ్గురు వ్యక్తులను ఢీకొన్నాడు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి, అతని కారును స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటన సోషల్ మీడియా కోసం ప్రాణాలను లెక్క చేయకుండా చేసే కొందరి యువతీ యువకుల అతివేగానికి నిదర్శనం.ఇలాంటి ఘటనలు ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి స్టంట్స్ చేసే కొందరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

వాట్సాప్ లో ఇలా చేస్తే ఇకపై జైలుకే..
Advertisement

తాజా వార్తలు