Madhave Madhusudana Review: మాధవే మధుసూదన మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

ప్రేమకథా చిత్రాలకు ఎప్పటినుంచో ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు వచ్చినా కూడా సరికొత్తగా ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి.

 Madheve Madhasudhana Movie Review And Rating Details Inside Tollywood-TeluguStop.com

ఇలాంటి సరికొత్త ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినదే మాధవే మధుసూదన( Madheve Madhasudhana) .తేజ్ బొమ్మదేవర( Tej Bommadevara )హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో రిషికి లొక్రే‌ ( Rishi Lokre ) హీరోయిన్‌గా నటించారు.సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం బొమ్మదేవర రామచంద్ర రావు.ఇలా సరికొత్త ప్రేమ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు నవంబర్ 24వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి అవతరణ పొందింది అనే విషయానికి వస్తే…

కథ:

మాధవ్ (తేజ్ బొమ్మదేవర) స్నేహితులు రవి (జోష్ రవి), శివ (శివ)లతో కలిసి జాలీగా తిరుగుతూ లైఫ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు ఇలా కొడుకు ఎలాంటి పని చేయకుండా తిరుగుతూ ఉండగా తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ తనకి ఉద్యోగం చేయమని సలహా ఇస్తారు.ఇలా బెంగళూరుకు వెళ్ళమని తల్లిదండ్రుల సలహా ఇవ్వడంతో మాధవ్ బెంగళూరుకి కాకుండా వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తాడు.మార్గమధ్యంలో ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మాయి (రిషికి లొక్రే)ని చూస్తాడు.

కానీ ఆమె ఎవరికీ కనిపించదు.కేవలం మాధవకే కనిపిస్తుంది? అసలు ఆ అమ్మాయికి మాధవకి ఉన్న సంబంధం ఏంటి? ఆరాధ్య అంటూ ఆ అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్తాడు? వీరిద్దరూ ప్రేమలో ఎలా పడతారు.వీరి ప్రేమ కోసం ఏం త్యాగం చేస్తారు అన్న తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

Telugu Rishi Lokre, Tej Bommadevara, Tollywood-Movie

నటీనటుల నటన:

తేజ్ బొమ్మ( Tej Bommadevara ) దేవరకు ఈ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నటువంటి హీరోగా నటించారు.ప్రతి ఒక్క సన్నివేశంలోనూ సన్నివేశానికి అనుగుణంగా హావభావాలను తెలియజేస్తూ అద్భుతంగా నటించారు.ఇక హీరోయిన్గా రిషికి కూడా తన నటన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో మిగిలిన తారాగణం మొత్తం ఎవరి పాత్రకు అనుగుణంగా వారు నటించారు.

Telugu Rishi Lokre, Tej Bommadevara, Tollywood-Movie

టెక్నికల్:

బొమ్మదేవర రామచంద్ర రావు( Bommadevara Ramchandra Rao ) నిర్మాతగాను, ఎంతో అద్భుతంగా మొదటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి ఇప్పటికి ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరికొత్త కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఫోటోగ్రాఫర్ కూడా అద్భుతమైన పనితీరును కనబరిచారు.మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది.ఎడిటింగ్ వర్క్ కూడా అద్భుతంగా అనిపించింది.

విశ్లేషణ:

ప్రేమ కథ సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్ని సినిమాలో ఒకే విధంగా ఉండవు కానీ ఈ సినిమాలో ప్రేమ కథకు విలన్ ఉండడు ఇదే విలన్ అంటూ సరికొత్త పాయింట్ ద్వారా దర్శకుడు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఎక్కడ కథలో వల్గారిటీ లేకుండా కథకు ఏం కావాలో కాకుండా అదే పాయింట్ తీసుకువచ్చారు.మొదటి హాఫ్ ఎలాంటి బోర్ కొట్టకుండా కథను సాగదీయకుండా చాలా జాలిగా సాగిపోయేలా ఉంది సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త కథను సాగదీశారు.

మొత్తానికి ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీగా అనిపించింది.

Telugu Rishi Lokre, Tej Bommadevara, Tollywood-Movie

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, స్క్రీన్ ప్లే, కథ మొత్తం సరికొత్తగా సరదాగా సాగడం.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ కాస్త సన్నివేశాన్ని సాగదీశారు.అక్కడక్కడ కాస్త బోరింగ్ సన్నివేశాలు.

బాటమ్ లైన్:

ప్రేమ కథ సినిమా అయినప్పటికీ సరికొత్తగా ప్రేక్షకులకు సినిమాను చూస్తున్నంత సేపు కొత్త అనుభూతిని ఇస్తుంది.ఎలాంటి బోర్ అనే ఫీలింగ్ లేకుండా ఒకసారి సినిమాని చాలా ఆసక్తిగా చూడవచ్చు.

రేటింగ్:3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube