తెలంగాణలో ఇకపై రావణ సామ్రాజ్యమే.. ఎంజాయ్ చేయండి.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి రానుందనే సంగతి తెలిసిందే.తెలంగాణ కొత్త సీఎం ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

 Madhavilatha Sensational Comments Goes Viral In Social Media Details Here , Soci-TeluguStop.com

సీఎం అభ్యర్థికి సంబంధించి రేపు ప్రకటన రానుందని సమాచారం.సీఎం అభ్యర్థిపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతుండగా డీకే శివకుమార్( DK Sivakumar ) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గురించి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మాధవీలత బీజేపీలో( BJP ) ఉన్న నేపథ్యంలో తెలంగాణలో నడిచేది రావణ రాజ్యమే అంటూ ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మాధవీలత ( Madhavilatha )పోస్ట్ లో ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణలో తినడానికి తిండి ఉండదని ఉద్యోగాలు రావని మహిళలకు భద్రత కరువవుతుందని హిందువుల పండుగలు జరగవని స్వేచ్చ అనేది కనిపించదని ఆమె అన్నారు.తెలంగాణ కాంగ్రెస్‌ ను అభిమానించే వాళ్లందరికీ శుభాకాంక్షలు అంటూ మాధవీలత కామెంట్లు చేశారు.

Telugu Congress, Madhavilatha, Sensational-Movie

ఇకపై రావణ సామ్రాజ్యమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని ఎంజాయ్ చేయాలని ఆమె అన్నారు.మాధవీలత కనీసం ఒక నెల పరిపాలనను కూడా చూడకుండా ఇలా కామెంట్లు చేయడం సరికాదని నెటిజన్లు చెబుతున్నారు.ప్రజల తీర్పును అవమానిస్తూ కామెంట్లు చేయడం పార్టీకి తీరని చేటు చేస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాంగ్రెస్‌తో పోలిస్తే.బీఆర్‌ఎస్‌( BRS )కు 99 మార్కులు ఇస్తానంటూ మాధవీలత అభిప్రాయపడ్డారు.

Telugu Congress, Madhavilatha, Sensational-Movie

మాధవీలత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.మాధవీలత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.రాజకీయాలలో మాధవీలత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

మాధవీలతను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.మాధవీలత కామెంట్ల గురించి కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube