హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా మరి కొంతమందికి నోటీసులు అందించారు నార్కోటిక్స్ పోలీసులు.ఇదే కేసులో హీరో నవదీప్ ను దాదాపు ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
మరోవైపు ఈ కేసులో ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఈవెంట్ ఆర్గనైజర్, పబ్ ఓనర్ కు ముందస్తుగా బెయిల్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఈనెల 26న గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసుల ఎదుట హాజరుకావాలని తెలిపింది.
ఈ క్రమంలో ఇవాళ డ్రగ్స్ కేసు నిందితులు గుడి మల్కాపూర్ పీఎస్ లో హాజరుకానున్నారు.







