యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్( Young hero Narne Nithin ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్( Mad Square ).
అలాగే ఇందులో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి( Sangeet Shobhan, Gauri Priya Reddy ) ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
నితిన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే.గత ఏడాది విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకున్నారు నార్నే నితిన్.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సీక్వెల్ పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఇప్పటికే మొదటి పాటను విడుదల చేయగా ఆ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.దీంతో తాజాగా ఈ సినిమా రెండో పాటను విడుదల చేశారు. "నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి" అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
తాజాగా విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ట్రెండింగ్ అవుతూ ఈ పాట దూసుకుపోతోంది.ఈ పాట కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాటపై ఎన్టీఆర్ అభిమానులు నితిన్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇకపోతే మ్యాట్ సినిమాతో నిర్మాత నా సూర్యదేవర నాగవంశీ ( Suryadevara Nagavamsi )అలాగే సోదరి హారిక నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ సినిమా హారిక,సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమా నితిన్ కు ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy