అమ్మ‌వారి ఆల‌యంలో అద్భుతం.. పూజారి త‌లుపులు తెర‌వ‌గానే...

భారతదేశం దేవాలయాల దేశం.రహస్యాలు, అద్భుతాలు కోకొల్ల‌ల్లుగా ఉన్న‌ అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.

చాలా దేవాలయాలలో నమ్మశ‌క్యంకాని అద్భుతాలను క‌నిపిస్తాయి.ఈ ఆలయాలలో జరిగే సంఘటనల వెనుక ఉన్న రహస్యాల‌ను నేటికీ ఎవ‌రూ ఛేదించలేదు.

ఈ దేవాలయాలలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ మైహార్‌లో ఉన్న శారదామాత‌ శక్తిపీఠం ఒకటి.మైహర్‌లోని శారదా దేవాలయం అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటి.

సతీమాత హస్తం ఇక్కడే పడిందని చెబుతారు.ఈ ఆలయం త్రికూట పర్వతంపైన ఉంది.

Advertisement
Maa Sharda Is Full Of Miracles Details, Maa Sharda, Maa Sharda Miracles, Maihar,

పర్వత శిఖరంపై నిర్మించిన ఈ ఆలయంలో నిష్టతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతారు.ఈ ఆలయం చాలా అద్భుతం.

ఈ ఆలయంలో ప్రతిరోజూ ఒక అద్భుత సంఘటన జరుగుతుంది.రాత్రి ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు కూడా పర్వతం దిగి ఇళ్ల‌కు వెళ‌తారు.

ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరు.కానీ మరుసటి రోజు ఉదయం, పూజారి రాకముందే, అమ్మవారి ముందు తాజా పూలు కనిపిస్తాయి.

ఈ తాజా పూల‌ను వీర యోధులు.దేవతకు సమర్పించారని నమ్ముతారు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

ఈ ఆలయానికి వీర‌యోధులు ఎవ‌రికీ కనిపించకుండా ప్రతిరోజూ అమ్మవారిని పూజించడానికి ఆలయానికి వస్తుంటారు.ఈ యోధులిద్దరూ ఈ దట్టమైన అడవిలో పర్వతంపై ఉన్న శారదా మాత పవిత్ర నివాసాన్ని కనుగొన్నారు.

Maa Sharda Is Full Of Miracles Details, Maa Sharda, Maa Sharda Miracles, Maihar,
Advertisement

ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు.శారదా దేవి తన కఠోర తపస్సుకు సంతసించి వారికి అమరత్వం అనే వరం ఇచ్చిందని చెబుతారు.అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరో క‌థ‌నం ప్రకారం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వీర‌యోధులు వారి నాలుకను కోసి అమ్మ‌వారికి సమర్పించారు.

అప్పుడు తల్లి వారి భక్తికి సంతసించి వారి నాలుకను తిరిగి జోడించింద‌ట‌.ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి 1001 మెట్లు ఎక్కాలి.అయితే గత కొన్నేళ్లుగా ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ప్రారంభమైంది.

తాజా వార్తలు