Maa Oori Polimera 2 Review : మా ఊరి పొలిమేర 2 రివ్యూ అండ్ రేటింగ్!

2021 వ సంవత్సరంలో హాట్ స్టార్ లో నేరుగా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలలో మా ఊరి పొలిమేర(Maa uuri Polimera) ఒకటి.సత్యం రాజేశ్( Satyam Rajesh ) , బాలాదిత్య ( Baaladitya ) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీలో ఎంతో అద్భుతమైన ఆదరణ అందుకుంది అయితే ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం నేరుగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Maa Oori Polimera 2 Movie Review And Rating-TeluguStop.com

ఈ సినిమా మొదటి భాగానికి కంటిన్యూ కావడంతో మొదటి పాటలు ఎవరైతే నటించారో వారే తిరిగి సీక్వెల్ సినిమాలో కూడా నటించారు .మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించింది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…

కథ:

కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కలిసి కేరళ( Kerala )కు పారిపోతాడు.అప్పటికే అడ్రాసుపల్లిలో వరుస హత్యలు జరుగుతాయి.ఇంతలో కొమురయ్య తమ్ముడు జంగయ్య కనిపించకుండా పోతాడు.అయితే.ఇదంతా మూఢనమ్మకాల నేపథ్యంలో కథ మొత్తం ఒక్కసారిగా నిధి వైపు మల్లుతుంది.

కొమురయ్య ఆ నిధి కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని తెలుస్తుంది.మరి ఈ సినిమాలో వెతుకుతున్నటువంటి ఆ నిధి ఎక్కడ ఉంది? అక్కడున్న చీకటి రాజ్యం ఏంటి? ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు ఆ నిధి ఎక్కడుందో తెలుస్తుందా? అసలు ఈ వరుస హత్యల వెనుక గల కారణం ఏంటి అనేది ఈ సినిమా కథ.

Telugu Anil Vishwanath, Baaladitya, Getup Srinu, Kerala, Maaoori, Satyam Rajesh,

నటీనటుల నటన:

ఈ సినిమాలో రాజేష్ బాలాదిత్య( Baladitya ) ఎంతో అద్భుతంగా నటించారు.వీరి పాత్రలకు ప్రాణం పోశారు. సత్యం రాజేష్ కమెడియన్ ( Satyam Rajesh )గా మాత్రమే కాకుండా ఈ సినిమా ద్వారా అన్ని పాత్రలలో కూడా ఇట్టే ఒదిగిపోగలడని నిరూపించారు.ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. సినిమా కథ మొత్తం భారీ ట్విస్టులతో భయంకరమైనటువంటి సన్నివేశాలతో ఎంతో అద్భుతంగా చూపించారు.

ఇక ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరిని భయపెట్టేలాగే ఉందని చెప్పాలి.

Telugu Anil Vishwanath, Baaladitya, Getup Srinu, Kerala, Maaoori, Satyam Rajesh,

విశ్లేషణ:

సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే మా ఊరి పొలిమేర పార్ట్ వన్ కు రీక్యాప్ లా ఉంటుంది.అంటే.మొదటి పార్ట్ చూడని వాళ్లు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.ఎక్కడా కథ అర్థం కానట్టుగా ఏం ఉండదు.ఇక ఈ సినిమాలో కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఎంటర్ అవుతాయి.సినిమాలో ఉన్న ట్విస్టులు చూసి షాక్ అవ్వాల్సిందే.

ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు .

Telugu Anil Vishwanath, Baaladitya, Getup Srinu, Kerala, Maaoori, Satyam Rajesh,

ప్లస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉంది, సినిమాలోని షాకింగ్ ట్విస్టులు ప్లస్ పాయింట్ అయ్యాయి.బిజిఎం అదిరిపోయింది.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీయబడ్డాయి.

బాటమ్ లైన్:

ఇలాంటి ట్రిస్టులతో కూడిన సస్పెన్స్ సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఈ సినిమా అలాంటి కోవకు చెందిన ఎక్కడా కూడా బోర్ కొట్టదు చాలా కొత్తగా ఉంది.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube