లింగ సమానత్వంపై ఓ తండ్రి వినూత్న ప్రయత్నం

మన చుట్టూ ఉండే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, దుకాణాల పేర్లలో సన్స్, బ్రదర్స్ అనే పేర్లను తరుచుగా చూస్తూ ఉంటాం.

ఆస్తులకి వారసులు అంటే మగవాళ్ళే అన్నట్లు వ్యాపార సంస్థలు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

అయితే ఈ పురుషాదిక్యం తరతరాలుగా ఉంది.సమాజంలో లింగ సమానత్వం గురించి అందరూ మాట్లాడుతారు కాని ఇలాంటి బోర్డుల విషయం ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు.

అది వారి ఇష్టం అన్నట్లు మాట్లాడుతారు.అయితే అలా పేరు పెట్టుకోవడంలో లింగ వివక్ష ఉందని కొందరు భావిస్తారు.

ఈ విషయం గ్రహించిన ఓ వ్యాపారి తాను అలాంటి తప్పు చేయకూడదని భావించాడు.పంజాబ్ లోని లుధియానాకు చెందిన మనోజ్ కుమార్ గుప్తా అనే కాంట్రాక్టరు తన మెడికల్ షాపుపై గుప్తా అండ్ డాటర్స్ అంటూ లింగ సమానత్వాన్ని సూచించే విధంగా రాయించారు.

Advertisement

ఇప్పుడీ దుకాణం బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.లింగ వివక్షను తొలగించే క్రమంలో ఇదో చిన్న ప్రయత్నం మాత్రమేనని మనోజ్ కుమార్ తెలిపారు.

భవన నిర్మాణ రంగానికి చెందిన ఓ కంపెనీ నడుపుతున్న మనోజ్ కుమార్ దానిపేరును గుప్తా అండ్ సన్స్ అంటూ గతంలో రిజిస్టర్ చేయించారు.అయితే లింగ సమానత్వం ఉండాలని బలంగా నమ్మే ఆయన మందుల దుకాణాన్ని కుమార్తె ఆకాంక్ష పేరిట రిజిస్టర్ చేయిస్తూ దానిపై గుప్తా అండ్ డాటర్స్ అని రాయించి తనలోని అభ్యుదయ భావాన్ని చాటుకున్నారు.

మొత్తానికి అతను చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మందికి స్ఫూర్తిగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు