'హైదరాబాద్'లో ఆదివారం విద్యుత్‌ వినియోగం ఎంతో తెలుసా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి భారత్ ను వణికిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నిన్న దేశంవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో నిన్న ఉదయం నుండి రాత్రి 9 గంటల వరుకు కూడా ప్రజలంతా ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆదివారం విద్యుత్ గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వార్త ఏంటి అంటే? జనతా కర్ఫ్యూ కారణంగా హైదరాబాద్‌ నగరంలో నిన్న విద్యుత్‌ వినియోగం దాదాపు అరవై శాతానికి పడిపోయింది అని సమాచారం.సాధారణ రోజుల్లో కంటే శని, ఆదివారాల్లో అత్యంత దారుణంగా విద్యుత్ వినియోగం తక్కువ ఉంటుంది.

ఇంకా ఈ ఆదివారం కర్ఫ్యూ కారణంగా తక్కువ వినియోగం అయ్యింది.నిజం చెప్పాలి అంటే కర్ఫ్యూ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి విద్యుత్ వినియోగం పెరగాలి.

కానీ అతి దారుణంగా విద్యుత్ వినియోగం తగ్గింది.అయితే ఇలా తగ్గడానికి కారణం పరిశ్రమలు, కార్యాలయాలు, మాల్స్‌ మూతపడడం కారణంగా వినియోగం తగ్గింది అని సమాచారం.

Advertisement
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

తాజా వార్తలు